Etela Rajender Slams CM KCR: బీజేపీ సభ నూతన ఆలోచనలకి తెర తీయనుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. ఎర్రజెండా మాత్రమే ఉన్న త్రిపురలో కూడా గెలిచిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ఈ ప్రభంజనం ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. అవిశ్వాస తీర్మానాలకు రెండు పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలనేదే తెలంగాణ ప్రజల అభిప్రాయం అని.. బీజేపీనే ప్రత్యామ్నయం అని అనుకుంటున్నారని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"సింగరేణికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చిన తరువాత పూర్వ వైభవం అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఆస్ట్రేలియా, మోజంబియలో మైనింగ్ చేస్తామని చెప్పి.. సింగరేణిని దివాలా తీయించారు. 1.6 లక్షల మంది ఉన్న ఉద్యోగులు, తెలంగాణ వచ్చేసరికి 62 వేల మంది అయితే.. ఈ పదేళ్లలో 43 వేల మందికి తగ్గించిన ఘనత కేసీఆర్‌ది. ఒకప్పుడు సింగరేణిలో మట్టి తీసే కాంట్రాక్ట్ మాత్రమే ప్రైవేట్ వారికి ఇచ్చే వారు.. ఇప్పుడు బొగ్గు కాంట్రాక్ట్ కూడా ప్రైవేట్ వారికే ఇస్తున్నారు. ప్రైవేట్ పరం చేస్తున్నది కేసీఆర్. 51 శాతం రాష్ట్రం, 49 శాతం కేంద్రం వాటా ఉంటే ఎలా కేంద్రం ప్రైవేట్ పరం చేయగలుగుతుంది..?


సింగరేణి ప్రస్తుతం 65 మిలియన్ మెట్రిక్ టన్నులు మైనింగ్ చేస్తుంటే.. నయిని, న్యు పాత్రల 35-40 మిలియన్ మెట్రిక్ టన్నుల గనులను కేంద్రం సింగరేణికి కేటాయించింది. కానీ ఏఎమ్‌ఆర్‌కి ఇచ్చి ప్రైవేట్ పరం చేసింది కేసీఆర్. దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ సంపద ప్రైవేట్ కాంట్రాక్ట్ పరం చేస్తున్నారు. సింగరేణి కాంట్రాక్ట్ మయం చేస్తున్నారు. బీజేపీనీ ఆశీర్వదిస్తే కేంద్రం అండదండలతో సింగరేణికి ఆనాటి వైభవం తీసుకొని వస్తాం. ప్రైవేట్ పరం చేసిన బొగ్గుగనులను సమీక్షిస్తం. 


బీజేపీ నియోజకవర్గానికి ఎక్కడికక్కడే చేరికలు ఉంటాయి. కేసీఆర్ లిస్ట్ ప్రకటించిన తరువాత ప్రభంజనం లెక్క మా దిక్కు వస్తున్నారు. తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్న కేసీఆర్ 11 శాతం ఉన్న మాదిగ జాతికి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. 0.6 శాతం ఉన్న వారికి మాత్రం 4 మంత్రులు. కీలక శాఖలు ఇచ్చుకున్నారు. ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ శాఖలు మాత్రమే వేరే వారికి ఇచ్చారు. నన్ను తొలగించిన మంత్రి పదవి కూడా మాదిగలకు ఇవ్వలేదు. బీసీలు రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్‌లో అన్ని పదవులు కేసీఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే ఇచ్చికుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు, కుల పార్టీగా మారాయి." అని ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కొన్ని పత్రికలు రోజు బీజేపీ ఊపు తగ్గిందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే కాంగ్రెస్‌ను లేపుతున్నారని.. రేపు బీజేపీ సత్తా ఎంటో తెలుస్తుందని అన్నారు.


Also Read: Hyundai Creta: హ్యుండయ్ క్రెటాలో తక్కువ ధర మోడల్ ఇదే, ఫీచర్లు ఇలా ఉన్నాయి


Also Read: Surya Dev: ఆదివారం ఈ పరిహారంతో జీవితంలో అదృష్టం, డబ్బు, గౌరవాన్ని పొందండి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook