MLA Etela Rajender at Indira Park: ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సమస్యలకు పరిష్కారం చూపే అడ్డా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దీన్ని ఎత్తివేసిన నియంత కేసీఆర్ అని.. ధర్మ పోరాటం చేసి పిడికిలి ఎత్తే అధికారం ఉందని చాటుకున్నామని అన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడానికి నీ అబ్బ జాగీరా కేసీఆర్..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"జీహెచ్‌ఎంసీలో 5 లక్షల మంది ఉన్నారు కేసీఆర్.. నువ్వు 500 మందికి పర్మిషన్ ఇస్తావా..? రేకులను అడ్డం పెట్టుకొని ఉండే వాళ్లకు 9 ఏళ్ల 2 నెలల కాలంలో ఇల్లు రాలేదు. మాటలు చెప్పిన కెసిఆర్ మన కళ్ళలో మట్టి కొట్టారు. సనత్ నగర్ నియోజకవర్గం IDH కాలనీలో 100 ఇళ్ళు కట్టి.. తెలంగాణ నలుమూలల నుంచి ఆడబిడ్డలను తీసుకువచ్చి చూపించారు. నేను పుట్టిందే మీ కోసం అన్నారు. కానీ 9 ఏళ్ళు గడిచిన డబుల్ బెడ్ రూం రాలేదు. డబుల్ బెడ్ రూం కోసం కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో ఉన్న హడ్కో 9 వేల కోట్లు అప్పు ఇచ్చింది. రూరల్ అర్బన్ మిషన్ కింద 1,311 కోట్లు కేంద్రం ఇచ్చింది. 9 ఏళ్లలో 20 లక్షల బడ్జెట్ పెట్టిన కేసీఆర్.. డబుల్ బెడ్ రూం కోసం ఇచ్చింది మాత్రం 600 కోట్లు.


2.91 లక్షల ఇళ్లు మంజూరు చేసి పేదలకు ఇచ్చింది 35 వేలు. కట్టిన ఇల్లు పాడుపడి పోతున్నాయి తప్ప ఇవ్వడం లేదు. వాటిని పంచే దమ్ము కేసీఆర్‌కు లేదు. భయంతో పంచడం లేదు.
ఇల్లు పంచని కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 2014 మన బడ్జెట్ లక్ష కోట్లు. ఇప్పుడు అది 3 లక్షల కోట్లకు చేరింది. 120 రూపాయలు ఉన్న సిమెంట్ 300 రూపాయలకు చేరింది. 35 రూపాయలున్న ఐరన్ 65కు చేరింది. మేస్త్రీ కూలీ 600 నుంచి 1500 అయ్యింది. అదే 2014లో 5 లక్షల రూపాయలు ఇస్తా అన్న కేసీఆర్.. ఇప్పుడు 2023లో 3 లక్షల రూపాయలు ఇస్తా అని  అంటున్నారు. మూడు లక్షల రూపాయలు బిక్షంలా ఇస్తారా..? పునాదులు కూడా పడవు. గృహలక్ష్మికి 5.04 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా..
మీరు శంకుస్థాపన చేసిన 42 బస్తీల్లో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూం కట్టాలి.


నీకు ఉంది 3 నెలల సమయమే. గృహ లక్ష్మి పథకం కేవలం ఓట్ల కోసమే తెచ్చారు. బీజేపీని ఆశీర్వదించండి ఇళ్ళకోసం  5.04 లక్షలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి సహకారంతో ఇస్తామని హామీ ఇస్తున్నాం. మాకు కులం, మతం, రాజకీయంతో సంబంధం లేదు. ఇల్లు లేకుండా బిక్కుబిక్కు మంటూ ఉన్నవారికి ఇల్లు ఇచ్చే జిమ్మేదార్ మాది. పట్టణాల్లో అపార్ట్మెంట్ కట్టించాలి. అర్బన్ హౌసింగ్ కింద కేంద్రం ఇస్తున్న నిధులు వాడాలి. పక్కన ఉన్న ఏపీని పేద దివాలా రాష్ట్రం అని కేసీఆర్ చెప్తారు. కానీ అక్కడ కూడా కేంద్రం సహకారంతో 20 లక్షల ఇళ్లు కట్టారు అని పేపర్లో రాస్తున్నారు. మళ్లీ నీకు అధికారం రాదు." అని ఈటల అన్నారు.  ఉద్యోగ నోటిఫికేషన్ పెడితే 17 పేపర్లు లీక్ అయ్యాయని.. డబ్బులు పెట్టినవాడికే ఉద్యోగాలు ఇచ్చిన నీచపు ప్రభుత్వమని విమర్శించారు. గ్రూప్ 2, ఎక్సాం పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారని.. మానవతా కోణంలో పోస్ట్ పోన్ చేయాలని కోరారు.


Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!  


Also Read: BJP Woman Leader Suicide: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్.. మహిళా నేత ఆత్మహత్య  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి