Etela Rajender Comments On Preethi Death Case: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, కాలేజీలో చదువుతున్న ఆడపిల్లలకు రక్షణ కరువైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. పీజీ చదువుతున్న డాక్టర్  ప్రీతిపై దుర్మార్గం జరిగినా.. ఏం జరిగిందో ప్రభుత్వపరంగా చెప్పలేదని మండిపడ్డారు. ముసలి కన్నీరు కారుస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ చేస్తున్న నిరసన దీక్షలో ఈటల పాల్గొన్నారు. ప్రీతిది వ్యవస్థ చేసిన హత్య అని.. ప్రీతి ఘటనకు గిరిజన సమాజంతో పాటు మహిళలందరూ బాధపడుతున్నారని అన్నారు.
 
'ప్రీతి సంఘటన కంటే ముందే అనేక ప్రాంతాలలో అత్యాచారాలు కొనసాగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్లో కూర్చొని నిమ్మకునీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం పశ్చాతాపం ప్రకటించలేదు. ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పకుండా మహిళా జాతిని అవమానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో హత్యలు, మానభంగాలు జరుగుతున్న కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. పైగా దేశంలోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. హైదరాబాదులో లక్షల కెమెరాలతో మహిళలను, ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నామని  కేసీఆర్ చెప్పుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో పట్టపగలే నడిరోడ్డు మీద హత్యలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. షీ టీంలు పెట్టామని చెప్తారు.. కంటికి కనిపించని పోలీస్ హైదరాబాదులో పనిచేస్తారు అని చెబుతున్నారు. షీటీంలు, పోలీసులు దేవుడు ఎరుగు.. కనీస భద్రత లేదు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ  ప్రభుత్వపరంగా బాధ్యత లేకుండా.. కేవలం కంటి తుడుపు చర్యలుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిని  ఆపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది..' అని ఈటల రాజేందర్ అన్నారు.


రాష్ట్రం వచ్చిననాడు 10700 కోట్ల రూపాయల మద్యం ఆదాయం ఉంటే.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయం 42వేల కోట్లు అని బాజాప్త బడ్జెట్లో పెట్టిన సిగ్గులేని ప్రభుత్వం మీది అంటూ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 24 కోట్ల జనాభా ఉంటే అక్కడ మద్యంఆదాయం 30 వేల కోట్లు మాత్రమే ఉందని.. కానీ నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో మాత్రం 40 వేల కోట్ల ఆదాయం ఇవాళ వస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంత క్షోభను, బాధను, ఎన్ని అవమానాలను భరిస్తున్నారనే బాధ  అర్థం కావాలని మనవి చేస్తున్నానని అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఎన్నడు బయటికి రాని మహిళలు దీక్ష చేస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయం, సీట్లు, ఓట్లు, గద్దె మీద కూర్చోవాలి.. దోచుకోవాలి అని మాత్రమే కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు. ప్రజలారా మీరంతా దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని కోరారు.


Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..  


Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook