Etela Rajender: ఈటల రాజేందర్ చేరికపై BJP MLA Raja Singh ఆసక్తికర వ్యాఖ్యలు
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ తనదైన స్టైల్లో స్పందించారు. ఈటల రాజేందర్ తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి అని కొనియాడిన రాజా సింగ్ (BJP MLA Raja Singh).. ఆయన బీజేపీలో చేరితే పార్టీ బలం పుంజుకుంటుంది అని అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే ఆయన తరహాలోనే టీఆర్ఎస్ చేతిలో మోసపోయిన నాయకులు ఎందరో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని చెప్పిన రాజా సింగ్.. బీజేపీలోకి ఈటల రాజేందర్ చేరికను అడ్డుకునే వాళ్లు కానీ అభ్యంతరం చెప్పేవాళ్లు కానీ ఎవ్వరూ లేరని వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం (Etela Rajender joining BJP) ఇష్టం లేని వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఒకవేళ అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నట్టయితే, వారు పార్టీలోంచి వెళ్లిపోయినా పార్టీ పెద్దగా పట్టించుకోదు అని స్పష్టంచేశారు. రాజా సింగ్ (BJP MLA Raja Singh) చేసిన ఈ వ్యాఖ్యలతో బీజేపి ఈటల రాజేందర్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మరోసారి నిరూపితమైంది.
Also read : Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్‌డేట్స్
ఇదిలావుంటే, ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధమైంది. రెండు రోజుల క్రితమే ఈటల రాజేందర్‌ని తీసుకుని ఢిల్లీ వెళ్లిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అక్కడ బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అరగంటకుపైగా జేపీ నడ్డాతో చర్చలు జరిగాయి. ఈ భేటీలో తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు కీలకంగా చర్చకొచ్చాయని, తెలంగాణలో టీఆర్ఎస్‌కి (TRS Party) ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ ఈటల రాజేందర్‌కి అండగా నిలుస్తుందని జేపీ నడ్డా (JP Nadda) భరోసా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహూర్తం మినహా (Etela Rajender to join BJP on this date) దాదాపు మిగతా ప్రక్రియ అంతా పూర్తయినట్టేనని తెలుస్తోంది.
Also read: Telangana: తెలంగాణలో తగ్గినట్టు కనిపిస్తున్న కరోనావైరస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook