Raja Singh Gets Bail : బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రొఫెట్ మొహమ్మద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్‌పై ముస్లిం సోదరులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోషామహల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం మధ్యాహ్నం రాజా సింగ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం కోర్టు ముగిసే సమయానికి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన నాంపల్లి కోర్టు.. రాజా సింగ్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలుకు తరలించాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, చట్ట ప్రకారం 41 సీఆర్పీసీని అనుసరించి తనకు నోటీసులు ఇవ్వాలని.. కానీ తన అరెస్టు విషయంలో అలా చేయనందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే రాజా సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. రాజా సింగ్‌కి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. రాజాసింగ్ ని నాంపల్లి కోర్టు వద్దకి తీసుకొస్తున్నారనే సమాచారం అందుకున్న ముస్లిం సోదరులు, పలువురు మత పెద్దలు నాంపల్లి కోర్టుకు చేరుకుని రాజా సింగ్‌కి (BJP MLA Raja Singh News Updates) వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Also Read : Asaduddin Owaisi: హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర..అసద్దుదీన్ ఓవైసీ హాట్ కామెంట్స్..!


Also Read : BJP Mla Raja Singh: రాజాసింగ్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్..పార్టీ నుంచి సస్పెన్షన్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి