MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ లాయర్ కు బెదిరింపులు.. హైదరాబాద్ లో మరో కలకలం
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో తాజాగా మరో కలకలం రేగింది.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున హైకోర్టులో వాదించిన లాయర్ కు బెదిరింపులు వచ్చాయి.
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో హైదరాబాద్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజాసింగ్ అరెస్ట్ కావడం.. రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించడంతో సాయంత్రం ఆయన విడుదల కావడం జరిగింది. రాజాసింగ్ విషయంలో తాజాగా మరో కలకలం రేగింది.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున హైకోర్టులో వాదించిన లాయర్ కు బెదిరింపులు వచ్చాయి. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అడ్వకేట్ కరుణ సాగర్ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు తనకు మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు లాయర్ కరుణ సాగర్. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కరుణ సాగర్. ఎవరి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.
రాష్ట్రంతో పాటు దుబాయ్ నుంచి తనకు బెదిరంపు కాల్ వచ్చిందని కరుణ సాగర్ చెప్పారు. రాజా సింగ్ తరపున వాదిస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఒక న్యాయవాదిగా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చానే తప్ప ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలేదని కరుణ సాగర్ చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్టపరంగా వ్యవహరించలేదు కాబట్టే.. ఆయన రిమాండ్ రిపోర్టును కోర్టు కొట్టివేసిందని తెలిపారు. 41 సీఆర్‌పీసీ నిబంధనలు పాటించకుండా రాజాసింగ్ ను అరెస్ట్ చేయడం వల్లే రాజాసింగ్ కు ఊరట కల్గిందన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. రాజాసింగ్ కు వ్యతిరేకంగా సోమవారం పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో రాజాసింగ్ పై హైదరాబాద్ లో నాలుగు, ఇతర ప్రాంతాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. మంగళ్ హాట్ పీఎస్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ సమయంలో 41 సీఆర్‌పీసీ, సుప్రీంకోర్ట్ నియమాలు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్లు వాదించారు. ఈా వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. రాజాసింగ్ రిమాండ్ రిపోర్టును కొట్టివేసింది. రాజాసింగ్ తరపున కరుణ సాగర్ కోర్టులో వాదించారు. దీంతో అతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భావిస్తున్నారు.
Read Also: CM Jagan Comments: ఆ పని చేశాకే ఎన్నికలకు వెళ్తా... ఏపీలో హాట్ హాట్ గా మారిన సీఎం జగన్ కామెంట్
Read Also: AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి