AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్

Nagarjuna Sagar: ఏడేళ్ల క్రితం జరిగిన సీన్ రిపీటైంది. తెలుగు రాష్ట్రాల పొలీసులు కొట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం నాగార్జున సాగర్ లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా కూడా అదే ప్రాంతం వేదికైంది. మంగళవారం రాత్రి నాగార్జున సాగర్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య ఫైటింగ్ జరిగిందని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 24, 2022, 09:53 AM IST
  • నాగార్జున సాగర్ లో ఏడేళ్ల క్రితం సీన్
  • ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్

    రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో ఉన్నతాధికారులు
AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్

Nagarjuna Sagar: ఏడేళ్ల క్రితం జరిగిన సీన్ రిపీటైంది. తెలుగు రాష్ట్రాల పొలీసులు కొట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం నాగార్జున సాగర్ లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా కూడా అదే ప్రాంతం వేదికైంది. మంగళవారం రాత్రి నాగార్జున సాగర్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య ఫైటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఏపీ సివిల్ పోలీసులు, తెలంగాణ ఎస్‌పీఎఫ్ పోలీసులు పరస్పరం ఘర్షణ పడ్డారని సమాచారం.

రాత్రి సమయంలో నాగార్జున సాగర్ డ్యాంపైకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రైట్ బ్యాంక్ ఎస్ఐ ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత డ్యామ్ పైకి ప్రాజెక్టు అధికారులు తప్ప ఇతరులు ఎవరిని అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. డ్యాంపైకి వచ్చేందుకు యత్నించిన ఏపీ ఎస్ఐని తెలంగాణ ఎస్‌పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ పోలీసుల వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. జరిమానా విధించారు. ఈ రెండు ఘటనలతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ జరిగింది. కొందరు పోలీసులు కొట్టుకున్నారని తెలుస్తోంది. తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఏపీ, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు.. గొడవ జరిగిన విషయం బయటికి రాకుండా గొడవ జరిగిన పోలీసుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఒకరి పై ఒకరు కక్షపూరితంగా వ్యవహరిస్తుండటంతో చిన్న చిన్న విషయాల్లోనూ వివాదం నెలకొందని చెబుతున్నారు.

2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాగా.. రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆ సమయంలో తీవ్ర ఉద్రికత్తలు తలెత్తాయి. నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది.  తెలంగాణ అధికారులు సాగర్‌ డ్యాం కుడి గట్టు క్రస్ట్‌ గేట్ల స్విచ్‌ రూమ్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు స్విచ్‌ రూమ్‌ తాళాలు ఇవ్వాలని, లేదంటే తలుపులు పగులగొట్టి తెరవాల్సి ఉంటుందని లేఖ రాశారు. అయినా తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు మాచర్ల డీఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడికాల్వ డీఈ ఆధ్వర్యంలో కుడిగట్టు క్రస్ట్‌ గేట్ల స్విచ్‌ రూమ్‌ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసులు పరసర్పం ముష్టిఘాతాలకు దిగారు. పోలీసుపై పోలీసులే లాఠీచార్జీకి దిగి కొట్టుకునేంత వరకు వెళ్లారు. అయితే 2015లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల విభేదాల కారణంగా జరగగా.. ఇప్పుడు జరిగింది మాత్రం వ్యక్తిగత విభేదాల వల్లేనని తెలుస్తోంది.

Read also: Graduate MLC Election: ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉత్తరాంధ్ర నుంచి..

Read also: Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x