తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కాల్చిపారేయాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఇటీవలే మత ప్రార్థనల్లో పాల్గొని. .  తెలంగాణకు చేరిన వారు.. తమను తామే దాచుకుంటున్నారని రాజా సింగ్ విమర్శించారు. వారు తక్షణమే ప్రభుత్వ అధికారులకు అందుబాటులోకి రావాలన్నారు.  లేనిపక్షంలో  తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  గతంలో సీఎం కేసీఆర్. ..  లాక్ డౌన్ కు సహకరించని వారిని  కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ ఇచ్చి కాల్చిపారేస్తామని చెప్పారు. ఇప్పుడు మత ప్రార్థనల్లో పాల్గొని వైద్య బృందానికి సహకరించకుండా ఉన్న వారిని కాల్చిపారేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.



 


ఢిల్లీలో 'కరోనా' అలజడి 


వారి కారణంగా దేశం మొత్తం  ప్రమాదంలో  పడే అవకాశం ఉందని అన్నారు.  ఢిల్లీలో జమాతే  ప్రార్థనల కోసం వారికి ఎవరు అనుమతి ఇచ్చారని రాజాసింగ్ ప్రశ్నించారు.  దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమాధానం  చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..