దేశ రాజధాని ఢిల్లీలో 'కరోనా' అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనంలో దాదాపు 24 వందల మంది ఒకే చోట మత ప్రార్థనలు చేయడం... వారిలో 24 మందికి 'కరోనా వైరస్' పాజిటివ్ రావడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది.
మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు చేసిన తర్వాత చాల మంది వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మర్కజ్ భవనంలో 1500 నుంచి 1700 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 24 మందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నివేదిక వచ్చింది. దీంతో అక్కడున్న మొత్తం వెయ్యి 34 మందిని ఖాళీ చేయించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అందులో 334 మందిని ఆస్పత్రులకు తరలించామని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మిగతా 7 వందల మందిని ఢిల్లీలోని పలు క్వారంటైన్లకు పంపినట్లు వెల్లడించారు.
ఢిల్లీలో ఒకే చోట ఇంత మంది గుమిగూడడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై ఉన్నతాధికారులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. మర్కజ్ భవనం నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులకు సూచించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఢిల్లీలో 'కరోనా' అలజడి