హైదరాబాద్: బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హిందువుల ఓట్లు పడితే చాలు..ఆవు మాంసం తినేవారి ఓట్లు అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఓ ప్రముఖ మీడియా ఇంటర్యూలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యాలు చేశారు. కాగా ఎమ్మేల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంఐఎం కాలుపెట్టిన ప్రతీ చోట ప్రచారం చేస్తా..
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ ఎంఐఎం కాలుపెట్టిన ప్రచారం చేసిన ప్రతీచోట తనకు ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశించిందని పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో హిందువులు నివాసముండే పరిసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని.. అభివృద్ధి విషయంలో కూడా  మతమే ప్రాతిపదికగా చూస్తున్నారని విమర్శించారు. దేశ రక్షణ, హిందువుల పరిరక్షణ కోసం బీజేపీ ఆవిర్భవించిందని.. పార్టీ సిద్ధాతాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని .. ఆ దిశగా తాము పోరాడుతున్నామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. 


అసదుద్దీన్ తో పోటీ అంశంపై రాజాసింగ్ రియాక్షన్
ఎంఐఎం చీఫ్ అసుద్దుద్దీన్ తో పోటీ చేసే అంశంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పోటీ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ హైకమాండ్ ఆదేశిస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ఈ సందర్భంగా అమిత్ షాతో భేటీ లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై స్పందిస్తూ..పార్టీ చీఫ్ తో తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై మాత్రమే చర్చ జరిగిందన్నారు.తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానం ఆదేశిస్తుందన్నారు. పార్టీ పెద్దల ఆదేశాల మేరకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.