Bandi Sanjay: విద్యార్థుల బలవన్మరణాలకు ప్రభుత్వమే కారణం: బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి (Inter students suicide) పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఎవరూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని..నూరేళ్ల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు (Bandi Sanjay on students suicide) బండి సంజయ్.
విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. వారికి న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇంకెంత మంది విద్యార్థులు బలి కావాలని ప్రశ్నించారు.
ఇంటర్ ఫలితాల్లో 51 శాతం మంది ఫెయిల్..
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు (TS Inter results) ఫెయిల్ అయ్యారు. ఈ కారణంగా పలువురు విద్యార్థులు మనస్థాపానికి గురై.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఓ విద్యార్థి ఏకంగా తన మరణానికి కేటీఆర్ కారణం అంటూ ట్వీట్ చేయడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే అత్యధికంగా ఫెయిల్ అవడం ఇందుకు నిదర్శనమన్నారు.
ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యుయేషన్ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. విద్యార్థుల కోసం న్యాయపోరాటం చేసేందుకు బీజేపీ వెనకాడబోదని స్పష్టం చేశారు.
ఉద్యోగాల విషయంలో జాప్యం..
ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కూడా ప్రభుత్వం జాప్యం (Jobs Notification) చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే ఉద్యోగాలు అంటూ ఊదరగొడతారని కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
జీవో 317 కూడా నోటిఫికేషన్ ఇవ్వమనే కుట్రలో భాగమని ఆరోపిచారు పండి సంజయ్. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలిశాకే నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో కూడా సీఎం కేసీఆర్ చెప్పారని.. అలాటప్పుడు నోటిఫికేషన్ రేపు, మాపు అంటు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఉద్యోగ ఖాళీల లెక్క..
రాష్ట్రంలో లక్ష్యా 92 వేల ఉద్యోగ ఖాళీలు (Jobs in Telangana) ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు బండి సంజయ్. అయినా ప్రభుత్వం ఇంకా ఖాళీలపై క్లారిటీ రాలేదంటోందని విమర్శలు చేశారు. టీఎస్పీఎస్ఈలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై అగ్రహంగా ఉన్నారని వెల్లడించారు.
Also read: 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు
Also read: Teacher Suicide: కాలేజీలో కామ క్రీడలు.. రాసలీల వీడియో వైరల్- లేడీ టీచర్ ఆత్మహత్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook