2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు
వచ్చే 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్లి, అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మంగళవారం చెప్పారు.
వచ్చే 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్లి, అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మంగళవారం చెప్పారు. "మాకు పొత్తులు లేవు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోరాడి, అధికారంలోకి రానుంది" అని ఆయన అన్నారు. 2019లో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. "రాష్ట్ర ప్రజలు నిరాశతో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైంది" అని ఆరోపించారు.
"సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను అమలు చేస్తాడని గత మూడేళ్లుగా ప్రజలు ఓపికతో వేచి చూశారు. కానీ వారు నిరాశపరిచారు ఈ ఏడాది కూడా.. " అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజలకు కొత్త ప్రతిపాదన ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ''2018లో బీజేపీ టిఆర్ఎస్ పై ఎన్నికల యుద్ధాన్ని ప్రకటిస్తోంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కొత్తగా చేసేదేమీ లేదు. వారు ఈ రాష్ట్రంలోనే కాదు, ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిచోటా తిరస్కరించబడుతున్నారని ఎద్దేవా చేశారు.
119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో.. బీజేపీకి ప్రస్తుతం ఐదు ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. 2017లో బీజేపీ ప్రజలకు చేరువైంది. కొత్త సంవత్సరంలో కూడా పార్టీకి మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.