Bandi Sanjay Padayatra: పాదయాత్ర చేపట్టేందుకు నిర్మల్ జిల్లాకు బయల్దేరిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఆదివారం రాత్రే పోలీసులు జగిత్యాలా దాటిన తర్వాత అడ్డుకుని వెనక్కి పంపించారు. పాదయాత్రకు పోలీసుల అనుమతి లేని కారణంగానే ఆయన్ను పాదయాత్రకు వెళ్లకుండా అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే తమ పార్టీ అధ్యక్షుడి పాదయాత్రకు అనుమతి లేదని అడ్డుకోవడంపై నిర్మల్ జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్తున్న బీజేపి కార్యకర్తలపై పోలీసులు చేయిచేసుకున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. నిర్మల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళుతున్న బీజేపి నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపి కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. మీరు ఎంత రెచ్చ కొట్టినా మేం సంయమనంతో పాటిస్తున్నాం. మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దు అని బండి సంజయ్ పోలీసులకు, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. 


ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలువుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. మాల్యాల చౌరస్తా వద్ద పోలీసులు పైశాచికంగా ప్రవర్తించారని.. బీజేపి కార్యకర్తలను విచక్షణారహితంగా విచక్షణారహితంగ చితకబాదారని అన్నారు. పోలీసుల రాక్షసంగా ప్రవర్తిస్తూ నూకపల్లి ఉప సర్పంచ్ డొక్కలో ఎస్ఐ కిషోర్ కాళ్ళతో తన్నారని బండి సంజయ్ ( Bandi Sanjay Kumar ) ) మండిపడ్డారు.


Also Read : CM KCR: అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్..? పార్టీ నేతలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..!


Also Read : Minister KTR: మంత్రి కేటీఆర్ పరువు తీసిన ఎమ్మెల్యే.. సాయంత్రానికి మారిపోయిన సీన్


 


Also Read : Group 4 Posts 2022: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్‌.. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook