Bandi Sanjay Padayatra: బండి సంజయ్ కాన్వాయ్‌కి వాహనాలు అడ్డం పెట్టిన పోలీసులు.. హైవేపై హై టెన్షన్!!

Bandi Sanjay Padayatra in Bhainsa: శాంతియుత పద్ధతిలో పాదయాత్రకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ రాకకు ఏర్పాట్లు చేసి యూ టర్న్ తీసుకుంటారా అని పోలీసులను ప్రశ్నించారు.

Written by - Pavan | Last Updated : Nov 27, 2022, 10:52 PM IST
  • బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లేదని కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు
  • ప్రభుత్వానికి, పోలీసులకు టైమ్ ఇస్తున్నా.. బండి సంజయ్ కామెంట్స్
  • బైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా ? డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్..
Bandi Sanjay Padayatra: బండి సంజయ్ కాన్వాయ్‌కి వాహనాలు అడ్డం పెట్టిన పోలీసులు.. హైవేపై హై టెన్షన్!!

Bandi Sanjay Padayatra in Bhainsa: 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ వెళ్తున్న తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల దాటిన అనంతరం జగిత్యాల పోలీసులే తమ పెట్రోలింగ్ వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బండి సంజయ్ కాన్వాయ్ ని అడ్డగించారు. బండి సంజయ్ ను చుట్టుముట్టిన పోలీసులు.. పాదయాత్రకు అనుమతి లేనందున పాదయాత్రలో పాల్గొనడానికి వీల్లేదని బండి సంజయ్ ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిర్మల్ వెళ్లే రహదారిపై ఉద్రిక్తత నెలకొంది.

ప్రభుత్వానికి, పోలీసులకు టైమ్ ఇస్తున్నా.. బండి సంజయ్ కామెంట్స్
శాంతియుత పద్ధతిలో పాదయాత్రకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. పాదయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత చివరి నిమిషంలో అనుమతి లేదని చెప్పడం ఏంటని విస్మయం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ పాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్నారని పోలీసులకు సమాచారం పంపించాం. దగ్గరుండి సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన తరువాత ఇలా యూటర్న్ తీసుకుంటారా అని బండి సంజయ్ నిలదీశారు. రూట్ మ్యాప్ కూడా ప్రకటించి బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాక హఠాత్తుగా అనుమతి లేదని అడ్డుకోవడం ఏంటని బండి సంజయ్ మండిపడ్డారు. 

బైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా ?
బైంసా సున్నిత ప్రాంతం అని కారణం  చెబుతున్నారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా ? అక్కడికి ఎందుకు పోవద్దని ప్రశ్నించారు. ఒక్క బైంసా ప్రాంతాన్నే కాపాడలేని ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు అని కేసీఆర్ ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి అని అన్నారు. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని అడిగారు. 

డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్.. 
ఏదేమైనా రేపు బహిరంగ సభకు వెళ్లి తీరుతా.. పాదయాత్ర చేపట్టి తీరుతా అని బండి సంజయ్ ప్రకటించారు. రేపు సోమవారం మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉంది. అప్పటివరకు ప్రభుత్వ దోరణి ఏంటో వేచిచూస్తాం. ప్రభుత్వం వినకపోతే అవసరమైతే న్యాయస్థానం తలుపు తడతాం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పోలీసుల విజ్ఞప్తి మేరకు తాను కరీంనగర్ వెళ్తున్నానని.. రేపు మధ్యాహ్నం వరకు వేచిచూస్తానని బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఒకరకంగా ప్రభుత్వ స్పందన, పోలీసుల సమాధానం కోసం రేపటి మధ్యాహ్నం వరకు వేచిచూస్తామని చెప్పడం ద్వారా బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) పరోక్షంగానే డెడ్ లైన్ విధించినట్టు అర్థమవుతోంది.

Also Read : Minister KTR: మంత్రి కేటీఆర్ పరువు తీసిన ఎమ్మెల్యే.. సాయంత్రానికి మారిపోయిన సీన్

Also Read : CM KCR: అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్..? పార్టీ నేతలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..!

Also Read : CM KCR: అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్..? పార్టీ నేతలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News