Bandi Sanjay on CM Kcr: తెలంగాణ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇకపై టీచర్లు ఏటా తమ ఆస్తుల వివరాలను చెప్పాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది వివాదస్పదమవుతోంది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ తీరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫైర్ అయ్యారు. టీచర్లపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఏటా ఆస్తులు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏటా సీఎం కేసీఆర్ ఎందుకు ఆస్తుల వివరాలను ప్రకటించడం లేదని ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా అని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే చందంగా సీఎం కేసీఆర్ తీరు ఉందన్నారు బండి సంజయ్. 317 జీవో పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు బదిలీలు చేస్తున్నారన్నారు.


ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా..ఏటా ఆస్తులను ప్రకటించాలని చెప్పడం ఏంటన్నారు బండి సంజయ్. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోపై ప్రశ్నించినందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తీరు తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు ఏటా ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగపూర్, మలేషియా, దుబాయిలో సీఎం, ఆయన ఫ్యామిలీ దోచుకుని దాచుకున్న ఆస్తుల వివరాలను బయట పెట్టాలన్నారు.


Also read: SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..అందుబాటులోకి మరిన్ని సేవలు..!


Also read: Telangana Govt: ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Linkhttps://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి