Bandi Sanjay fire on CM KCR: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ డిమాండ్ (Bandi Sanjay on GO 317) చేశారు. ఈ జీవో వల్ల ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని వల్ల స్థానికులనైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇది ముఖ్యమంత్రి తుగ్లకు పాలనకు నిదర్శనమని విమర్శించారు (Bandi Sanjay fire on CM KCR) బండి సంజయ్.


ఉద్యోగ సంఘాలతో చర్చించి.. అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఉద్యోగుల్లో చీలిక తెస్తూ..


ముఖ్యమంత్రి కేసీఆర్​ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలక తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సంజయ్. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. దీనితో పాటు ఇతరత్ర సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్లేలా వ్యవహరిస్తున్నారని కేసీఆర్​పై ధ్వజమెత్తారు.


పాత సమస్యలు దారిమళ్లించేందుకే..


పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయంగా పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్నారని.. సీఎంపై బండి సంజయ్​ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ డబ్బుతో పాటు ఉద్యోగుల సమస్యలపై డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు.


Also read: Obscene Dance in Pub: పబ్ లో అశ్లీల నృత్యాలు.. 9 మంది మహిళలు అరెస్ట్


Also read: Road Accident: లారీని ఢీకొట్టిన కారు-ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook