DK Aruna: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ కుటుంబంలో వచ్చిన విభేదాలతోనే షర్మిల పార్టీ పెట్టారన్నారు. గతంలో వాళ్లు ఎప్పుడు తెలంగాణ కోసం పోరాడ లేదని..పని చేయలేదని విమర్శించారు. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రా వాళ్లు ఎవరూ పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. సెంటిమెంట్‌తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారని గుర్తు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో షర్మిల ఎందుకు పోటీ చేయలేదని..తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఏపీలోనే ఆమె ఉన్నారని.. ప్రచారం చేశారన్నారు. అప్పుడు ఎందుకు పోటీ చేయలేదని మండిపడ్డారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విభజన సమయంలో ముంపు మండలాలను ఏపీలో కలిపారని..ఐతే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు డీకే అరుణ.


అక్కడి ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ముంపు మండలాల్లో మౌలిక వసతులు లేవని..కనీస అవసరాలు తీర్చలేదని ఫైర్ అయ్యారు. అందుకే తెలంగాణలో కలపాలన్న డిమాండ్ పెరిగిందన్నారు డీకే అరుణ. బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారని..త్వరలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ఏ సమయంలో చేర్చుకోవాలో జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని..బీజేపీ పవర్‌లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు డీకే అరుణ. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, జగన్‌కు మంచి అండర్‌ స్టాండింగ్ ఉందన్నారు. ఓట్ల సమయంలో మాత్రమే విమర్శించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమం జరగాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సదస్సు ఏర్పాటు చేశామన్నారు.


Also read:Bandi Sanjay: మునుగోడులో ఉప ఎన్నిక తప్పదా..బండి సంజయ్ ఏమన్నారంటే..!


Also read:Bhatti Vikramarka: రాజగోపాల్ రెడ్డిని ఒప్పించే ప్లాన్ ఉంది..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook