Bomb blast threat call to telangana praja bhavan: తెలంగాణలోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపుల ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని ఆగంతకుడు కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్స్ చేసి మరికాసేపట్లో ప్రజాభవన్ ను పేలిపోతుందంటూ చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజాభవన్ సెక్యురిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాంబు స్వ్యాడ్ దళాలు రంగంలోని దిగాయి. ప్రజాభవన్ లో ప్రతిచోట డిటెక్టర్ లతో జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం తనిఖీలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు జాగీలాలతో ప్రజాభవన్ కు చేరుకున్నారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాతీసినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..


నగరం నడిబొడ్డున ఉన్న ప్రజాభవన్ లో బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడ చుట్టు పక్కల ఉన్న ప్రజలను అలర్ట్ చేశారు. ప్రజాభవన్ సమీపంలో ప్రత్యేకంగా బందోబస్తు చేపట్టినట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా.. ప్రజాభవన్ లో ఎక్కక కూడా బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు బాంబు కాల్స్ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆగంతకుడి కాల్స్ ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. 


Read more: Snake: వామ్మో.. ఫ్యాన్ మీద ప్రత్యక్షమైన భయంకరమైన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


ఫోన్ కాల్ రాగానే కంట్రోల్ రూమ్ పోలీసులు, పంజాగుట్టుపోలీసులను అలర్ట్ చేశారు. కాగా, జ్యోతిబాపూలే ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్కకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు కాల్  మాత్రం తీవ్ర కలకలంగా మారింది. ఇటీవల అనేక స్కూళ్లకు, ఆలయాలకు , రైల్వేస్టేషన్ లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు మంగళవారం కావడంతో ఎక్కువ మంది తమ అర్జీలను ఇవ్వడానికి ప్రజాభవన్ కు వస్తుంటారు.ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు కాల్ తో పోలీసులు సీరియస్ గా తనిఖీలు చేపట్టారు. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook