Bomb Threat to Train: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తోన్న రైల్లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు 100కి డయల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైల్వే శాఖకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. ఆ సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు వస్తున్నట్లు గుర్తించి.. ఆ రెండింటినీ సమీప రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. రెండు రైళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బుధవారం (ఏప్రిల్ 13) ఉదయం 10.20 గం. సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు 100కి డయల్ చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న రైల్లో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్ వస్తోన్న కోణార్క్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లను సమీప స్టేషన్లలో నిలిపివేయాల్సిందిగా రైల్వే పోలీస్ సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేటలో, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి స్టేషన్‌లో నిలిపివేశారు.


రెండు రైళ్లలోని ప్రయాణికులను కిందకు దింపి అన్ని బోగీల్లో తనిఖీలు జరిపారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించడంతో తిరిగి రైళ్లను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో రెండు రైళ్లు దాదాపు గంట ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుకున్నాయి. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మేడ్చల్ బహదూర్‌పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ విష్ణు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. రైళ్లలో బాంబులు పెట్టినట్లు ఫేక్ బెదిరింపు కాల్స్ చేసిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 


Also Read: KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమాపై నెటిజన్ల టాక్... 'టెర్రిఫిక్ మెంటల్ మాస్'...


Eluru Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook