Eluru Fire Accident: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడున్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫలితంగా కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి అక్కడున్న రియాక్టర్ కూడా పేలినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమయంలో150 మంది సిబ్బంది పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా గాయపడినవారిలో మరో వ్యక్తి మరణించాడు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడివారికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రమాదంపై పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. ఏలురు జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి 5 లక్షలు, సాధారణ గాయాలైతే 2 లక్షల పరిహారం ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు స్థానికులు కాగా మిగిలినవారు బీహార్‌కు చెందినవారుగు గుర్తించారు. క్షతగాత్రుల్లో కూడా ఎక్కువమంది బీహారీలే ఉన్నారు. గాయపడిన 12 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించి..చికిత్స అందిస్తున్నారు.
Also read: Eluru Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు, ఐదుగురి సజీవ దహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook