Man dies heart attack while doing pradakshina video viral: కార్తీక మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలంతా కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈనెల రోజులపాటు చాలా మంది నాన్ వెజ్ లకు, మద్యానికి దూరంగా ఉంటారు. కేవలం దేవుడి నామస్మరణ చేస్తు, పూజలు, వ్రతాల్లో బిజీగా ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. దేశంలో ఎక్కడ చూసిన కూడా కార్తీక మాస శోభ కన్పిస్తుంది. ఆలయాలన్ని కూడా భక్తులతో కిట కిటలాడుతున్నాయి. సూర్యోదయంకు ముందే భక్తులు లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని ఆలయంకు వచ్చేస్తున్నారు. దీపారాధన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలోని హనుమాన్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


 



పూర్తివివరాలు..


ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్ల కాస్త హర్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ప్రస్తుతం  మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కూడా గుండెపోటులకు కారణమౌతున్నాయని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా కొందరు డ్యాన్స్ లు చేస్తు గుండెపోటుకు గురయ్యారు. మరికొందరు జిమ్ లు చేస్తు  కూడా చనిపోయారు. అంతే కాకుండా.. ఉద్యోగాలు చేస్తు కూడా చాలా మంది చనిపోయిన సంఘటనలు వైరల్ గా మారాయి.


తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  హైదరబాద్ లోని కేపీహెచ్‌బీలోని హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. విష్ణువర్ధన్ అనే యువకుడు.. టెంపుల్ కు వచ్చాడు. అతను భక్తితో స్వామివారిని దర్శించుకున్నాడు. అయితే గుడిలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో విష్ణుకు కాస్త అలసటగా అన్పించినట్లుంది. వెంటనే అక్కడున్న పిల్లర్ ను పట్టుకున్నాడు.


ఒక్కసారిగా చూస్తుండగానే కుప్పకూలీపోయి పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు.. 108 కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అతడిని చూసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Read more: Viral Video: బాప్ రే.. షూలో దూరి బుసలు కొడుతున్న నాగు పాము.. వీడియో వైరల్..


ఈ విష్ణువర్ధన్ మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నట్లు తెలుస్తొంది. గుడికి వెళ్లి తమ కొడుకు విగత జీవిగా మారతాడని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.