BR Ambedkar Statue: ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదు: సీఎం కేసీఆర్
Telangana CM KCR Says BRS will win in 2024 Parliament Elections. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
Telangana CM KCR Says BRS will win in 2024 Parliament Elections: ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని, ఆయన విశ్వమానవుడు అని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం అంతటా ప్రతి ఏడాది 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర తీరాన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన మనువడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
బీఆర్ అంబేద్కర్ విగ్రహా (BR Ambedkar Statue Hyderabad) ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 'బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తయింది. ప్రతి ఏడాది మనం అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నాం. అయితే ఎస్సీలు మాత్రం ఇంకా అభివృద్ధి చెందలేదు. అంబేడ్కర్ కలలు సాకారం కావాలి. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహంను ఏర్పాటు చేయలేదు. అంబేడ్కర్ విశ్వమానవుడు.. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్ఠించుకున్నాం. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారకం ఉన్నాయి. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాం. ఇది విగ్రహం కాదు.. విప్లవం' అని కేసీఆర్ అన్నారు.
'డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట ప్రతి ఎద్దడి అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారు. అవార్డు కోసం ప్రత్యేకంగా రూ. 51 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. ఏటా రూ. 3 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. దాంతో ఏటా అంబేడ్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డు ఇస్తాం. తెలంగాణ కలలను సాకారం చేసుకునే చిహ్నమే ఈ విగ్రహం. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు' అని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
'ప్రజలు గెలిచే రాజకీయం రావాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. దేశంలో ప్రతి ఏటా 25 లక్షల దళిత కుంటుంబాలకు దళితబంధు అమలు చేస్తాం. అయితే ఈ మాటలు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఒక చిన్న మినుగురు చాలు అంటుకోవడానికి. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు గొప్ప స్పందన వచ్చింది. యూపీ, బిహార్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుంది. జాతీయ రాజకీయాల్లో ఇదే రకమైన కార్యక్రమాలు చేసేందుకు పార్టీని జాతీయంగా విస్తరించాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అని సీఎం చెప్పుకొచ్చారు.
Also Read: Budh Asta 2023: అస్తమిస్తున్న బుధుడు.. 9 రోజుల తర్వాత ఈ రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.