KCR Fires On CM Revanth Reddy In Suryapet Public Meeting: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పట్టిపీడిస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ నేతలు నాశనం పట్టిస్తురన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకుని, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే విధంగా తమను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రజలను కోరారు. దీనిలో భాగంగానే.. తెలంగాణలోని లోక్ సభ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో బస్సులో పర్యటించడానికి బస్సు యాత్ర ప్రారంభించారు.ఈ బస్సుయాత్రలో ముఖ్యంగా.. అబద్ధపు హమీలతో రేవంత్ సీఎం అవ్వడం, పథకాలు అమలు చేయమంటే అందరిని దూశించమడే కాంగ్రెస్ సీఎం, మంత్రులు ఒక పనిగా పెట్టుకున్నారని మాజీ సీఎం తీవ్రంగా విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..


ఈ నేపథ్యంలో సూర్యాపేటలో జరిగిన బహింరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ మాట మాట్లాడితే కేసీఆర్ పేగులు మెడలో వేసుకుంటా, నీ గుడ్లు పీకి గోలీలు ఆడుతా.. ముడ్డీ మీద చెడ్డీ కూడా లాక్కుంటా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపై పై కేసీఆర్ తనదైన స్టైల్ లో పంచ్ లు కురిపించారు. ముడ్డీ మీద చెడ్డి లాక్కుని ఏంచేసుకుంటావ్ అని రేవంత్ ను ప్రశ్నించారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతో కొడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ విమర్శించారు. రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయని, వారు కొడితే మరోలా ఉంటుందంటూ కేసీఆర్ సెటైర్ వేశారు. కేసీఆర్..  పర్యటలనలో.. మిర్యాలగూడ మార్గమధ్యంలో నల్గొండ బైపాస్ రోడ్డులో ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద రైతులను చూసి కేసీఆర్ బస్సు ను ఆపి వారిగోడును విన్నారు. నల్గొండలో గత కాంగ్రెస్ ప్రభుత్వం మురికి మూసీ నీళ్లు సరఫరా చేసేవారని గుర్తు చేశారు.


బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. మిషన్ భగీరథ ద్వారా అద్బుతమైన నీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ దాన్ని కూడా నాశనం చేస్తుందన్నారు. 1956 నుంచి ఈ నాటి వరకు మన శత్రువే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. 1956లో తెలంగాణని, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి.. 58 సంవత్సరాలు మనల్ని గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కాదా.. అంటూ ప్రజలను కేసీఆర్ మరోమారు ఉద్యమ జ్వాల రగిలించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగొలు 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముళ్లగా సొచ్చి మనల్ని మరల  అవస్థలపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..


మన ప్రభుత్వంలో అద్భుతమైన 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పాం.. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పిల్లలకు తిండి సరిగ్గా పెట్టక 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కేసీఆర్ అన్నరు. ఇదిలా ఉండగా..కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. ప్రజలు భారీగా తరలి వచ్చి,పూలు చల్లుతూ బాణా సంచా కాలుస్తూ కేసీఆర్‌కు బోనాలతో ఎదురేగిన వందలాది మహిళలు స్వాగతం పలుకున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter