Unemployed youth protest in telangana for dsc and groups exams: తెలంగాణలో నిరుద్యోగుల నిరసన తారాస్థాయికి చేరిందని చెప్పుకొవచ్చు. ఇటీవల ఓయూలో అభ్యర్థులు చేస్తున్న నిరసనలు, తెలంగాణ పోరాటం రోజుల్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే నిరుద్యోగులు ప్రజాభవన్, టీజీపీఎస్సీనీ ముట్టడించడానికి అనేక పర్యాయాలు ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. అంతేకాకుండా.. నిరుద్యోగుల్ని, వారిని సపోర్ట్ గా ఉంటున్న విద్యార్థి సంఘం నేతలు, రాజకీయ నాయకుల్ని సైతం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇటీవల విద్యార్థులను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తున్న అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.


ఈ నేపథ్యంలో నిన్న రాత్రి (జులై 13) నిరుద్యోగులు రాత్రిపూట వేలాదిగా రోడ్లమీదకు చేరుకున్నారు. అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ రోడ్ల మీద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదావేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీలు వీరికి మద్దతును తెలిపాయి. మరోవైపు.. విద్యార్థులను పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్ నిరుద్యోగుల పట్ల చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారంగా మారాయి. నిరుద్యోగుల్ని.. ముదిరిపోయిన బెండకాయలు అనడం, కొద్ది మంది డబ్బులు తీసుకుని నిరసన చేస్తున్నారని,కోచింగ్ సెంటర్ మాఫియా అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు.


నిన్న రాత్రి నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన నిరసలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి.. కండకావరం తో మాట్లాడడం మానుకోవాలంటూ కూడా.. కేటీఆర్ చురకలంటించారు. సీఎం రేవంత్.. వెంటనే తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  విద్యార్థుల పట్ల.. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారంటూ మండిపడ్డారు. 


నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని అవమానించేలా మాట్లాడటం దారుణమన్నారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుందని..తమని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తుందన్నారు. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలని ఏకీ పారేశారు. కాంగ్రెస్ ను  వదిలిపెట్టే ప్రసక్తిలేదని... క్షేత్రస్థాయిలో నిలదీస్తామంటూ విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామంటూ హెచ్చరించారు. 


ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు... లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశమన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకి... బేషజాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మటికే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలేనని ఫైర్ అయ్యారు. గతంలో ఏ పరీక్ష రాస్తుండని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేశారో చెప్పాలని అన్నారు. అశోక్ నగర్ లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్ రెడ్డి... మీరు సన్నాసులా... రాహుల్ గాంధీ సన్నాసులు అనే విషయం చెప్పాలని  పంచ్ లు వేశారు.


అశోక్ నగర్ లో.. యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతున్న అంశం వాస్తవం కాదా.. రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడాలన్నారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడని... ఆయన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిదని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే చిత్తశుద్ధి ఉంటే  ఉద్యోగాల పైన, నోటిఫికేషన్ల పైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..


నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లను వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ అన్నారు.  గ్రూప్ వన్ మెయిన్స్ రేషియోను 1:100 గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హమీలనే నిరుద్యోగులుఅడుతున్నారని, వెంటనే డీఎస్సీ, గ్రూప్స్ లను వాయిదావేసి, పోస్టుల సంఖ్యలనుపెంచి నోటిఫికేషన్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి