BRS MLA Lasya Nanditha Death News: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో మరణించారు. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. స్పాట్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌, పీఏకు  కూడా తీవ్ర గాయాలు కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది.  ప్రమాదం జరిగిన వెంటనే వెనుక నుంచి వస్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వాహనాన్ని తప్పించబోయి.. సడెన్ బ్రేక్ వేయడంతో కారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. అతివేగం, నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తృటిలో ప్రాణాలు నుంచి బయటపడ్డారు. లాస్యనందిత ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టగా.. ఆమె తలకు గాయాలయ్యాయి. పది రోజుల్లోనే మరో రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత ప్రాణాలు విడిచారు. ఏడాది క్రితమే కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించగా.. ఆయన కుమార్తె లాస్యనందితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు.  


కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేసిన లాస్యనందిత.. తండ్రి సాయన్న మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 17,169 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లాస్యనందిత తండ్రి సాయన్న 1994 నుంచి 2004 వరకు 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లోనూ బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అనారోగ్యంతో గతేడాది కన్నుమూశారు. తండ్రి మరణించిన ఏడాదికే లాస్య రోడ్డుప్రమాదంలో కన్నుమూయడంతో కంటోన్‌మెంట్ నియోజకవర్గ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 


ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ప్రయాణం ఒక కారణమైతే.. మిడిల్ సీటులో కూర్చున్న నందిత.. సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ కావడం మరో కారణం. 10 రోజుల క్రితం ఆమె స్కార్పియోలో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు ఆ డ్రైవర్‌ను మార్చినా నందిత బతికేవారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం లిఫ్ట్ ప్రమాదం నుంచి కూడా ఆమె బయటబడ్డారు. మూడో ప్రమాదం నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు. 


Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!


Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter