Kavitha Absent for KTR's Nizamabad Meeting : కేటీఆర్‌ నిజామాబాద్‌ టూర్‌‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీ, కేటీఆర్ కి స్వయానా చెల్లి అయిన కల్వకుంట్ల కవిత రాకపోవడం రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కేటీఆర్‌ నిజామాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైన నాటి నుండి ఆ మీటింగ్ ఏర్పాట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నీ తానై వ్యవహరించారు. మెగా జాబ్‌మేళా నిర్వహణ దగ్గర నుంచి మొదలుకుని ఐటీ హబ్‌ ప్రారంభోత్సవం వేదికల ముస్తాబు వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. నిజామాబాద్ అర్బన్‌, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ వంటి అంశాలపైనా దృష్టిసారించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్‌ ప్రోగ్రాం భారీ సక్సెస్ అయ్యేలా భారీ ఏర్పాట్లు, సన్నాహాలు విషయంలో ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి బీఆర్ఎస్ నేతలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వాల్సిన అన్ని సూచనలు ఇచ్చారు. అన్న కేటీఆర్ మీటింగ్ కోసం చెల్లి కవిత పడుతున్న ఆరాటం చూసిన వాళ్లంతా.. మంత్రి కేటీఆర్ మీటింగ్ లో ఇక చెల్లి కల్వకుంట్ల కవితదే హడావుడి ఉంటుంది అని అనుకున్నారు. కానీ చివరకు కేటీఆర్‌ ప్రోగ్రాంకు కవిత రాకపోవడం చూసి అందరూ అవాక్కయ్యారు. దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్న కవితమ్మ మీటింగ్ కి వస్తే తమకు రిపోర్ట్ కార్డుపై మార్కులు పడతాయని భావించిన బీ.ఆర్.ఎస్ శ్రేణులు నిరుత్సాహపడ్డాయి. 


కవిత హెలిప్యాడ్‌లో అన్నతో కలిసి కనిపించకపోవడంతో ఉదయం నుంచే స్థానిక ప్రజాప్రతినిధులు, ఆమె అనుచర బృందం ఆమె రాక గురించి ఆరా తీస్తూ కనిపించారు. కవిత ఈ కార్యక్రమానికి రాకపోవడానికి రాజకీయ కారణాలూ ఏమైనా ఉన్నాయా అని ఎవరికి తోచిన కారణాలు వాళ్లు వెతుకున్నారు. ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు. ఎవరి అభిప్రాయలు వారు షేర్‌ చేసుకున్నారు. అన్న ప్రోగ్రాంలో చెల్లి లేకపోవడంతో ఏదో వెలితిగా అనిపించింది అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోసాగారు. 


ఇంతకాలం పాటు పెండింగ్‌లో పడుతూ పడుతూ వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినప్పటికీ.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్‌లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది. జ్వరం వల్ల రాలేదని కొందరు, సీఎం క్యాంపు కార్యాలయంలో పని ఉండి రాలేకపోయారని ఇంకొందరు, సిఎంతో కలిసి మహారాష్ట్రకు వెళుతున్నట్లు మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెప్పినప్పటికీ.. కేటీఆర్ మీటింగ్ కి కవిత రాకపోవడానికి బలమైన కారణం ఏదో ఉందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమయ్యింది. 


ఇది కూడా చదవండి : KTR Speech In Nizamabad: రేవంత్ రెడ్డిపై ప్రాసలతో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్


ప్రతీనెల జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు ఆమె ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పడంతో ఇందూరు యువతలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆమె చొరవతో కొత్త కంపెనీలు, పేరు మోసిన బడా కంపెనీలు ఇందూరు యువతకు జాబ్‌లు ఇచ్చేందుకు వస్తున్నాయనే ఆశాభావం పెరిగింది. ఈ నెల 29న భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో మళ్లీ మెగాజాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని చెప్పిన కవిత.. ఇక ప్రతీనెల జాబ్‌మేళాలు ఉంటాయని ఇందూరు యువతకు తీపి కబురు చెప్పారు. చివరకు ప్రాధాన్యత కలిగిన మంత్రి కేటీఆర్‌ ప్రోగ్రాంలో కల్వకుంట్ల కవిత కనిపించకపోవడం పెద్ద వెలితిగా భావిస్తుండగా..ఇందులో రాజకీయాలూ ముడిపడి ఉన్నాయనే కోణంలో కూడా చర్చించుకోవడం గమనార్హం.


ఇది కూడా చదవండి : Baby Boy And Baby Girl Exchanged: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల తారుమారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి