Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో చిన్న పిల్లల తారుమారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన భూక్య సుమిత్ర జూలై 31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయింది. సుమిత్రకు పండంటి బాబు పుట్టాడు. అయితే బాబుకు పసిరికలు కావడంతో ఎస్.ఎన్.సి.యు లోని బాక్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలావుంటే, కేసముద్రం మండలం దస్రు తండా చెందిన సునిత ఈ నెల 4వ తేదీన ఇక్కడే ప్రసూతి అయి పాపకు జన్మనిచ్చింది. సునితకు పుట్టిన బిడ్డకుకు శ్వాస సరిగా ఆడకపోవడంతో ఆ పసికందును ఎస్.ఎన్. సి.యు లోని బాక్సులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాబుకు ఫీడింగ్ ఇవ్వడం కోసం ఎస్.ఎన్.సి.యు లో నుండి సుమిత్ర బాబును సునితకు ఇచ్చారు. బాబుని తీసుకున్న సునిత కుటుంబ సభ్యులు యధావిధిగా వార్డుకు వచ్చారు.
తమకు పాపకు బదులు బాబుని ఇచ్చారు అనే విషయం దాచిపెట్టిన సునిత దంపతులు ఆ బాబుకు పాలు పడుతుండగానే.. కొంత సమయం తర్వాత వార్డులోని ఇరుగుపొరుగు వారు అసలు విషయాన్ని గుర్తించారు. ఇదే విషయమై సునిత కుటుంబసభ్యులను నిలదీశారు. మీకు పాప పుట్టింది కదా.. మరి మీ చేతుల్లోకి బాబు ఎక్కడి నుండి వచ్చాడు అని ప్రశ్నించారు. సునీతను వాళ్లు వీళ్లు ఇలా నిలదీస్తున్న సమయంలోనే అక్కడే ఉన్న ఆ బాబు వాళ్ల అమ్మమ్మ ( బాబు అసలు తల్లి సుమిత్ర వాళ్ల అమ్మ) సునిత వద్ద ఉన్న బాబును చూసి జరిగిన మోసాన్ని గుర్తించారు. బాబుకు ఉన్న కాటుక బొట్టును తానే పెట్టానని.. ఇతడు మా బాబేనని తేల్చిచెప్పిన బాబు వాళ్ల అమ్మమ్మ.. తమ బాబు మీ దగ్గరికి ఎలా వచ్చాడు అని సునిత కుటుంబసభ్యులతో పాటు అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.
తన బాబును మరొకరికి అప్పగించారని తెలుసుకున్న బాబు తండ్రి కూడా ఆస్పత్రి సిబ్బందిని నిలదీయడంతో అసలు విషయం గ్రహించిన సిబ్బంది.. బాబు తల్లి పేరు సుమిత్ర, పాప తల్లి సునిత ఒకేవిధంగా ఉండటంతో పొరపాటున పాప తల్లిదండ్రులకు బాబుని అప్పగించామని.. ఇది పొరపాటున జరిగిన తప్పిదమే కానీ కావాలని చేసింది కాదు అని అన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : Kavitha Absent for KTR Meeting: నిజామాబాద్‌లో కేటీఆర్ మీటింగ్‌కి కవిత డుమ్మాపై పబ్లిక్ టాక్
అయితే, ఇదే విషయమై బాబు తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఇలా మొత్తం మూడు వార్డులున్నాయని.. బాబుని మేమున్న వార్డులోనే మరొకరికి ఇచ్చారు కాబట్టి అదృష్టవశాత్తుగా వెంటనే గుర్తుపట్టామని.. అలా కాకుండా ఒకవేళ తమ బాబుని వేరే వార్డులో ఉన్న వాళ్లకు ఇచ్చి ఉంటే అప్పుడు గుర్తుపట్టే అవకాశం కూడా లేదు కదా అని అన్నారు. అదే కానీ జరిగి ఉంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి అని బాబు తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన మహబూబాబాద్ వాసుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ఇది కూడా చదవండి : Telangana Weather Report : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి