MLC Kalvakuntla Kavitha On BRS: తెలంగాణలో అన్నిరకాలుగా శాంతియుత వాతావరణం ఉంటే.. దేశంలో మాత్రం విపరీత ధోరణితో ఉన్న నాయకత్వం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. విపరీత ధోరణులను పక్కనపెట్టి.. సహృదయంతో ఆలోచించే నాయకత్వం రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలంపూర్‌లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, ‌జోగులాంబ అమ్మవారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకూ అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో  ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా గతంలో ఆలంపూర్ ప్రాంతానికి నీరు వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం ‌నీటి‌ సదుపాయం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ గారు ఆర్డీఎస్ ప్రాజెక్టు పాదయాత్ర ద్వారా ఆలంపూర్ ప్రాంతాన్నంతా కదిలించి ఉద్యమంలో నడిపించారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ప్రాజెక్టును బలోపేతం చేశాం. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తుమ్మిళ్ల లిఫ్ట్, ఆలంపూర్ లిఫ్ట్‌లను బాగు చేసుకున్నాం. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు.. కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేస్తున్నారు..' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.


టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశవ్యాప్తంగా సేవ చేయాలని ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్‌కు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు.. ఆలంపూర్‌ను అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ ఛైర్మన్లు మేడె రాజీవ్ సాగర్, సాయిచంద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


Also Read: RCB Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌కు బాధ్యతలు   


Also Read: Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో వందకుపైగా ఫొటోలు, వీడియోలు షేర్ చేయండి ఇలా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి