KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్ చేస్తా: కేసీఆర్
KCR Live Interview Present Politics: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ఛానల్లో తొలిసారి ఇంటర్వ్యూకు వచ్చారు. ఈ సందర్భంగా నాలుగు నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
KCR Speech: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ ఫిరాయింపులు, కుమార్తె కవిత అరెస్ట్, జాతీయ రాష్ట్ర రాజకీయ అంశాలపై బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు అని తనపై జరుగుతున్న విమర్శల దాడిపై కేసీఆర్ వర్ణించారు. కాంగ్రెస్ పార్టీ సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి
'కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలని కుట్ర చేస్తున్నారు. అది సాధ్యమా' అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. విలువైన ఐదు నెలల కాలాన్ని శ్వేతపత్రాల పేరిట వృథా చేశారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. ఆ సభలు అట్టర్ ఫ్లాపవుతున్నాయనేది కనిపిస్తోంది.
Also Read: BRS Party: ఎన్నికలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. గెలవబోయే స్థానాలు ఎన్ని అంటే?
విద్యుత్ వ్యవస్థపై సుదీర్ఘంగా కేసీఆర్ చర్చించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను దారిలో పెట్టే చేతకాకనే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు అని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి, ఇతరులు హామీలు నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని తమ ఫ్రస్టేషన్ చూపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీది రాజకీయ కృడ అని ఆరోపించారు. కేసీఆర్‌ది తెలంగాణ చరిత్ర అని ప్రకటించారు. కేసీఆర్‌ను తగ్గించాలని చాలా మంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. తాను పెరగాల్సిన ఎత్తు పెరిగాను.. నన్ను తగ్గించడమనేది ఉండదు. ఇది కాంగ్రెస్, బీజేపీ చిలిపి రాజకీయ క్రీడ అని పేర్కొన్నారు. అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును నేను డిజైన్ చేయలేదు.. నేను కేవలం స్ట్రాటజిస్ట్‌ను మాత్రమే అని స్పష్టం చేశారు. మేడిగడ్డ పిల్లర్లు కుప్పకూలినా కూడా నీళ్లు ఎత్తివేయవచ్చని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టుపై జ్ఞానం లేక రాష్ట్రాన్ని ఎడారి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనేది గొప్పదని.. సంవత్సరమంతా నీళ్లు పారించే గొప్ప ప్రాజెక్టు అని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 3 కోట్ల టన్నుల ధాన్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 35 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా పండుతున్నాయని స్పష్టం చేశారు. వాళ్లు మేడిగడ్డను రిపేర్ చేయకుంటే ప్రజలతో కలిసి నేను రిపేర్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter