KCR TV Dicussion Soon: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు స్వయంగా గులాబీ దళపతి కేసీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. ఓ టీవీ చానల్‌ ముందు కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తానని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడంతోనే ఈ పరిణామాలు వచ్చాయని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్‌ అదే విషయాన్ని ఓ టీవీ చానల్‌ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: VH: కన్నీళ్లు పెట్టుకున్న పెద్దాయన.. టికెట్‌ ఇస్తారా లేదా అని రేవంత్‌ రెడ్డికి ఆల్టిమేటం


 


లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ లోక్‌సభ అభ్యర్థి బోయనపల్లి వినోద్‌ కుమార్‌ను బలపరుస్తూ కరీంనగర్‌లో మంగళవారం బహిరంగ సభ నిర్వాహించారు. భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులను ఉత్సాహపరుస్తూనే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, బీజేపీ, స్థానిక బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై విరుచుకుపడ్డారు. గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష అని ప్రకటించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సమస్యపై త్వరలోనే టీవీ ఛానల్‌ ముందుకు కూర్చుంటానని ప్రసంగం చివరలో ప్రకటించి ఆసక్తికర చర్చ రేపారు.

Also Read: Telangana Next CM: ఇద్దరు సీఎంలను ఓడించా.. నేను ముఖ్యమంత్రి అవుతా: బీజేపీ ఎమ్మెల్యే సంచలనం


 


'రైతుబంధు అడిగితే చెప్పులతో కొడుతామని అంటున్నారు. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి లేకుండా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము తిట్టలేమా? లింకెబిందెల కోసం వచ్చారా? మాతో పోటీ పడేలా పాలన్‌ చేయ్‌ కానీ చీరుతాం.. బొంద పెడతాం అంటావా' అని రేవంత్ రెడ్డిపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహోరాత్రులు కష్టపడి మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా? అని ప్రశ్నించారు. 'రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా ఇచ్చాం. మేము అమలుచేసిన పథకాలు సక్రంగా అమలు చేసే దమ్ములేదా? కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలి' అని ప్రజలకు పిలుపునిచ్చారు. లేదంటే పథకాలు అడిగితే ప్రజలు నిజంగానే చెప్పుతో కొడతారు అని హెచ్చరించారు.


కాళేశ్వరంపై స్పందిస్తూ.. 'మేడిగడ్డలో చిన్న సమస్య ఎదురైతే దానిపై రాద్ధాంతం చేస్తున్నారు. రెండు పిల్లర్లు కుంగితే భారతే మునిగిపోతున్నట్టు బొబ్బలు పెడుతున్నారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్‌ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు. చూస్తుంటే నా కళ్ల వెంబట నీళ్లు వస్తున్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం ఎండిపోయిందా?' అని ప్రశ్నించారు. 'రెండు మూడు రోజుల తర్వాత ఓ టీవీలో కూర్చుంటున్నా. కాళేశ్వరం గొప్పతనం గురించి ఇంటింటికి చేరేలా చేస్తా?' అని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ గళం, దళం, బలం అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి