/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

V Hanumantha Rao: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు ఉండగా.. పార్టీ సీనియర్‌ నాయకులు మొదటి వరుసలో ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ స్థానం మాత్రం హాట్‌ కేక్‌లా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతుండగా.. వారిలో పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంత రావు కూడా రేసులో ఉన్నారు. అయితే టికెట్‌ ఇవ్వడం లేదనే వార్తల నేపథ్యంలో వీహెచ్‌ స్పందించారు.

Also Read: AP Politics: వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ప్రతిపక్షాలకు షాక్‌.. జగన్‌కు బూస్ట్‌

పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో వి హనుమంత రావు కూడా టికెట్‌ రేసులో ఉన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడినైన తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో తనవంతు పాత్ర ఉందని కొన్నాళ్లుగా చెబుతున్న వీహెచ్‌ తాజాగా ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఖమ్మం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినా ఎలాంటి గుర్తింపు లభించకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు. మొదటి నుంచి ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్న వీహెచ్‌ తరచూ ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు.

Also Read: Yousuf Pathan: రాజకీయాల్లోకి యూసుఫ్‌ పఠాన్‌.. మరి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడికి చుక్కలు చూపిస్తాడా?

'తనకు టికెట్‌ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలి. ఖమ్మం టికెట్‌ ఇస్తే గెలిచి వస్తా. అక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజలే కోరుతున్నారు. కానీ ఎందుకు ఇవ్వడం లేదు. భట్టి విక్రమార్క నాకు ఖమ్మం సీటు రాకుండా అడ్డుకుంటున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. భట్టి విక్రమార్క ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి నేనే కారణం' అని వీహెచ్‌ స్పష్టం చేశారు. 

'సోనియా, రాహుల్‌ గాంధీ నాకు న్యాయం చేయాలి. ఖమ్మంలో నేను లోకల్‌ కాదు అంటున్నారు. మరి రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్‌, రంగయ్య నాయుడు లోకలా. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పని చేసిన నాకు అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా' అని ప్రశ్నించారు. ఖమ్మం నుంచి పోటీకి తాను అర్హుడనని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే వ్యక్తిని కాదని, నా వయసు ఎంపీ టికెట్‌కు అడ్డంకి కాదని పేర్కొన్నారు. ఈసారి ఎలాగైనా ఖమ్మం టికెట్‌ తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Senior Leader V Hanumantha Rao Demands For Khammam MP Ticket Rv
News Source: 
Home Title: 

VH: కన్నీళ్లు పెట్టుకున్న పెద్దాయన.. టికెట్‌ ఇస్తారా లేదా అని రేవంత్‌ రెడ్డికి ఆల్టిమేటం

VH: కన్నీళ్లు పెట్టుకున్న పెద్దాయన.. టికెట్‌ ఇస్తారా లేదా అని రేవంత్‌ రెడ్డికి ఆల్టిమేటం
Caption: 
VH MP Ticket (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
VH: కన్నీళ్లు పెట్టుకున్న పెద్దాయన.. టికెట్‌ ఇస్తారా లేదా అని రేవంత్‌ రెడ్డికి ఆల్టి
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Sunday, March 10, 2024 - 23:58
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
13
Is Breaking News: 
No
Word Count: 
305