Mahipal Reddy Quits BRS Party: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పరంపర కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి మరో ఎమ్మెల్యే చేరిపోయారు. నగర శివారుకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వరుస కడుతున్నారు. కొన్ని నెలలుగా ఈడీ దాడులు ఎదుర్కొంటున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పటాన్‌చెరు నుంచి మూడుసార్లు కారు గుర్తుపై మహిపాల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆయన చేరికతో కాంగ్రెస్‌లో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఇదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bonalu 2024: బోనాల చెక్కుల పంచాయితీ.. నేలపై కూర్చోని మాజీ మంత్రి సబితా ఆగ్రహం


 


రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు చేరిన అనంతరం హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న నివాసంలో మహిపాల్‌ రెడ్డిని కండువా కప్పి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానం పలికారు. ఆయనతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన గాలి అనిల్‌ కుమార్‌ కూడా హస్తం గూటికి చేరడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవని కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులతో హైదరాబాద్‌పై గుత్తాధిపత్యం చేయాలని భావిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను చేర్చుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది.

Also Read: Loan Waiver Guidelines: రైతులకు రేవంత్‌ సర్కార్‌ భారీ షాక్‌.. రేషన్‌ కార్డు ఉంటేనే రుణమాఫీ


 


ఈడీ నుంచి రక్షణ కోసమే?
పటాన్‌చెరు స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్‌ రెడ్డిపై కొన్ని నెలలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వరుస దాడులు చేస్తోంది. తాజాగా వారం కిందట కూడా దాడులు చేయడంతో కలకలం రేపింది. అతడి సోదరుడిపై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. అతడిపై ఇంకా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అరెస్ట్‌ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న సమయంలో అనూహ్యంగా ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈడీ నుంచి రక్షణ కోసమే ఆయన అధికార పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి హామీ లభించడంతో వెంటనే మహిపాల్‌ రెడ్డి పార్టీ జంప్‌ అయ్యారని చర్చ నడుస్తోంది.


ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వీరే..
కడియం శ్రీహరి - స్టేషన్‌ ఘన్‌పూర్‌
దానం నాగేందర్‌ - ఖైరతాబాద్‌
తెల్లం వెంకట్రావ్‌ - భద్రాచలం
పోచారం శ్రీనివాస్‌ రెడ్డి - బాన్సువాడ
సంజయ్‌ కుమార్‌ - జగిత్యాల
కాలె యాదయ్య - చేవెళ్ల
బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి - గద్వాల
ప్రకాశ్‌ గౌడ్‌ - రాజేంద్రనగర్‌
అరికెపూడి గాంధీ - శేరిలింగంపల్లి
గూడెం మహిపాల్‌ రెడ్డి - పటాన్‌చెరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి