Revanth Reddy: విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు వరుస కడుతున్నారు. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలక నాయకుడు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు, హైదరాబాద్‌ మాజీ ఉప మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ కలవగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కీలక నాయకుడు బొంతు రామ్మోహన్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి త్వరలోనే రామ్మోహన్‌ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గతంలో జోడెద్దులుగా హైదరాబాద్ కు పనిచేసిన మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ కాంగ్రెస్ లో చేరుతుండడం గమనార్హం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Patnam Mahender Reddy: బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌ పార్టీలోకి 'పట్నం' దంపతులు?


అసెంబ్లీ ఎన్నికల్లో రామ్మోహన్‌ గులాబీ పార్టీ తరఫున ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ ఆశించారు. అయితే అక్కడ ఇతరులకు కేటాయించడంతో రామ్మోహన్‌ నిరాశ చెందారు. పార్టీ తరఫున బండారు లక్ష్మారెడ్డి పోటీ చేసి గెలిచారు. అతడు గెలుపులో రామ్మోహన్‌ కీలక పాత్ర పోషించారు. అయితే టికెట్‌ నిరాకరణతో అప్పటి నుంచి పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ కూడా ఆశిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం రామ్మోహన్‌ అభ్యర్థను పరిశీలించడం లేదు. టికెట్‌ దక్కే అవకాశాలు లేకపోవడంతో రామ్మోహన్‌ అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Also Read: Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక


ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నామినేటెడ్‌ పోస్టు హామీ ఇచ్చినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ కష్టం కానీ 'ఒక పదవి' ఇస్తానని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు అతడి అనుచరులు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో కన్నా అధికార పార్టీలో ఉండడం మేలనే భావనలో ఆయన కాంగ్రెస్‌ కండువా వేసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా రామ్మోహన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి వీరాభిమాని. ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌ వెన్నంటే నిలిచారు. బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నడిపించాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా బొంతు రామ్మోహన్‌ కీలకంగా వ్యవహరించాడు. అయితే పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదన అసంతృప్తికి లోనవుతున్నారు. అతడికి హైదరాబాద్‌ మేయర్‌గా అవకాశం కల్పించారు. అయినా రామ్మోహన్‌ సంతృప్తి చెందలేదు. ఇప్పుడు చివరకు కారును వీడే పరిస్థితి వచ్చింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook