Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక

Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై, రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 7, 2024, 10:26 PM IST
Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక

BRS Party Krishna Water Fight: కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వేధింపులు, నేరాలు పెరిగాయని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అప్పుడు మీ భరతం పడతామని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం మీద ఎన్నో అసత్యాలు చెప్తున్నారు, ఒక చిన్న సమస్య ఉంటే వెతికి పరిష్కరించినీళ్లు అందించాలని హితవు పలికారు. అంతేకానీ దాన్ని రాజకీయం చెయ్యొద్దని హితవు పలికారు.

Also Read: Free Medical Service: ప్రజలకు మల్లారెడ్డి ఆస్పత్రి శుభవార్త.. ఏ చికిత్స అయినా ఫ్రీ.. ఇక పాప పుడితే రూ.5 వేలు

జనగామలో హ్యాట్రిక్‌గా పార్టీ గెలవడంతో బుధవారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డితోపాటు పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు జనగామ అంటే ఎంతో గౌరవం ప్రేమ అని, ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా జనగామ, నర్మెట్ట, బచ్చన్నపేట, చేర్యాల విషయం ప్రస్తావిస్తారని చెప్పారు. జనగామ గడ్డ మీద హ్యాట్రిక్ విజయం అందించిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మనమంతా ఒక కుటుంబం లాగా పని చేద్దామని.. భవిష్యత్ మనదే అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సాగిస్తున్న పాలనపై విమర్శలు చేశారు.

Also Read: Sharmila Letter: జగనన్న, బాబుకు షర్మిల పిలుపు.. కేంద్రంపై రండి కొట్లాడుదామని ఆహ్వానం

ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంచి రోజులు వస్తాయని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, నిర్బంధాలు కొత్త కాదని స్పష్టం చేశారు. అధికారమైనా.. ప్రతిపక్షమైనా తమది ప్రజల పక్షం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఏనాడైనా నీళ్లు ఇచ్చిండ్రా అని నిలదీశౄరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 420 హామీలు ఇస్తామని చెప్పిండు మరి ఏమయ్యాయని ప్రశ్నించారు. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలుక ఉసిపోయినట్టు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల గురించి గ్రామాల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.

ఎన్నికలప్పుడు రైతుబంధు ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా వాళ్లు గెలిచిన తరువాత రైతులకు ఇవ్వడం లేదని హరీశ్ రావు గుర్తు చేశారు. కరోనా కాలంలో కూడా రైతుబంధు ఆపలేదని తెలిపారు. ఇప్పుడు అడిగితే రైతుబంధు ఆపి ఉద్యోగులకు జీతాలు వేశామని చెబుతున్నారు.. ఇప్పుడు వారికి జీతాలు, ఇటు రైతులకు రైతుబంధు రాలే అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదు అని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ కట్టిస్తే బంగారు బాత్రూమ్‌లు కట్టించుకున్నారని అబద్దపు ప్రచారాలు చేశారని, ఇప్పుడు భట్టి ఉంటున్నారని, ఆయననే ఎన్ని బంగారు బాత్రూమ్‌లు ఉన్నాయని అడగాలని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 4 మోసాలు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు. రైతుబంధు, రుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్‌, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీలు మరిచారని విమర్శించారు. ఇప్పుడు విద్యుత్‌ 14 గంటలు కూడా వస్తలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం కాదు కదా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం కూడా వచ్చే అవకాశం లేదని జోష్యం చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News