BRS Working President KTR: అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిని విస్తృత ప్రచారం చేయాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నడు తీసుకొని విధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదార్యంతో తీససుకున్న నిర్ణయాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని కేటీఆర్ అన్నారు. ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా  గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెబుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందర ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు సూచించారు. 


దీంతోపాటు ఒకటి రెండు రోజుల్లో అటు వీఆర్ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికులతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంఛార్జిలకు కేటీఆర్ చెప్పారు. కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అనాథల అందరిని ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి  బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా తీసుకున్న నిర్ణయం కూడా దేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం తీసుకోలేదన్నారు.  


రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా విస్తరణ తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చే నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుందని, నగర విస్తరణకు అనేక సానుకూల అంశాలు ఏర్పడతాయన్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 
 
మెట్రో విస్తరణ పూర్తి అయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు  అందించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందులు పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా ప్రకటించిన 500 కోట్ల రూపాయలు ప్రకటించిందని గుర్తు చేశారు. 


Also Read: Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర  


Also Read: CM KCR Maharastra tour: ఇవాళ మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌.. కారణం ఇదే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి