మేడారం: వనదేవతల సంస్కృతీసంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం జాతర బుధవారం ప్రారంభమైంది. ములుగు జిల్లా మేడారంలో జరిగే ఈ జాతర సమ్మక్క సారక్క జాతర పేరుతోనూ పిలుస్తారు. లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో మేడారం భక్త జనసంద్రమైంది. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించేకునేందుకు మేడారానికి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చున్నారు. తల్లులను గద్దెలకు తీసుకొచ్చే క్రమం నుంచి వన ప్రవేశం వరకు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ అంశాలపై సమీక్షిస్తుంది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతర ఏర్పాట్లు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. అయిదారు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్త జనసంద్రంతో మేడారం కిటకిటలాడుతోంది. 


మాఘశుద్ధ పౌర్ణమికి మూడు వారాల ముందు వచ్చే బుధవారం రోజున శుద్ధి పండుగ నిర్వహిస్తారు. తెల్లవారుజామున ఇళ్లు కడిగి శుభ్రం చేసుకుని ఆ తర్వాత గుడిని శుభ్రం చేసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మేడారంతో పాటుగా కన్నెపల్లి, పూనుగొండ్ల, కొండాయిలోని గోవిందరాజుల ఆలయాల్లో ఇవే పద్ధతులు పాటిస్తారు. గుడిని శుద్ధిచేశాక తల్లులను గద్దెల చెంతకు తీసుకొస్తారు. ఇక అక్కడి నుంచి పండుగలా జాతర సందడి మొదలవుతుంది.


ఉచిత వైఫై సేవలు
మేడారంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై సేవలు అందిస్తున్నట్లు వరంగల్ బీఎస్‌ఎన్‌ఎల్ డిప్యూటీ జనరల్  మేనేజర్ తెలిపారు. సమక్క సారక్క జాతర జరిగే  ఈ నాలుగు రోజుల పాటు (ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు) ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. జాతర పరిసర ప్రాంతాల్లో 20 వైఫై స్పాట్స్‌ను ఏర్పాటు చేసి 2G BTS-13, 3G BTS-14,4G BTS-1 ఇన్ స్టాల్ చేశామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


లాగిన్ విధానం:


  • మీ మొబైల్‌లలో  వైఫై ఆన్ చేయండి

  • తర్వాత QFI-BSNL-FREE-WIFI@Medaram కు కనెక్ట్ అవ్వాలి

  • ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి

  • మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి Log-in మీద క్లిక్ చేయండి

  • నాలుగు అంకెల పిన్ నంబర్ నమోదు చేయండి, లాగిన్ పేజీ లో start Browsing క్లిక్ చేయండి. ఇక నెట్ వాడుకోవచ్చు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..