BSP Telangana Chief RS Praveen kumar Resigns: లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే క్రమంలో తెలంగాణాలో ఊహించని బిగ్ ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో...  ఈడీ అధికారులు అరెస్టు చేసి రాత్రికి రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లారు. దీన్ని బీఆర్ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. ఎన్నికల షెడ్యూల్ కు ముందు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అంటూ వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?


ఈ ఘటనపై  ఇటు తెలంగాణాలో తీవ్రనిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణ బహుజన పార్టీ చీఫ్ కూడా ఈడీ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఒక మహిళను  ముఖ్యంగా, సుప్రీంకోర్టులో కేసు ఉండగా.. ఇలా అరెస్టు చేసి తీసుకెళ్లడమేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం ఇంటికి వెళ్లి మర్యాద పూర్తకంగ కలుసుకున్న విషయం తెలిసిందే.


Read More: Astrologer Venuswami: ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయం.. నిజమైన వేణుస్వామి మాటలు.. లాజిక్ భలే చెప్పేశాడుగా..


ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికలలో ఇద్దరు కలిసి పొత్తుతో ముందుకు వెళ్తామని కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి పూర్తిగా రాజీనామా చేయడం ప్రస్తుతం మరో బిగ్ న్యూస్ గా మారింది. ఇక మరోవైపు ఆయన మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎలాంటి ఉత్కంఠమైన ప్రకటన వస్తుందో అని బీఆర్ఎస్  శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook