Astrologer Venuswami: ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయం.. నిజమైన వేణుస్వామి మాటలు.. లాజిక్ భలే చెప్పేశాడుగా..

Delhi Liquor Scam: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటనలో అప్పటి సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత దీనిలో ఇబ్బందికరపరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పారు. తాజాగా, అచ్చం అదే ఘటన జరగటంతో మరోసారి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంగా మారాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 16, 2024, 12:02 PM IST
  • సంచలనంగా మారిన వేణుస్వామి వ్యాఖ్యలు..
  • కవిత ఈడీ అరెస్ట్ పై గతంలోనే పూర్తి క్లారిటీ..
Astrologer Venuswami: ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయం.. నిజమైన వేణుస్వామి మాటలు.. లాజిక్ భలే చెప్పేశాడుగా..

MLC Kalvakuntla Kavitha Arrested In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటన దేశంలోని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈడీ అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేసి, ఆమె ఉపయోగించిన ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమెను రాత్రికి రాత్రే అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.ఈ సమయంలో కవిత ఇంట్లో పెద్ద హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ అధికారులు వచ్చారని తెలియగానే కేటీఆర్, హరీష్ రావు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకున్నారు. మొదట కేటీఆర్, హరీష్ రావును కూడా ఈడీ అధికారులు లోపలికి అనుమంచలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?

ఇక మరోవైపు.. కేటీఆర్, ఈడీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఒకనోక సమయంలో కేటీఆర్, ఈడీ అధికారులను తీవ్రంగా ఎండగట్టారు. ఒక మహిళా నాయకురాలిని, ఎలాంటి ట్రాన్సిట్ నోటీసు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు అరెస్టు చేయమని చెప్పి,ఇలా దొడ్డి దారిన వచ్చి సోదాలేంటని మండిపడ్డారు. అదేవిధంగా.. ఇవి కేవలం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ల కుట్రలని వ్యాఖ్యానించారు. శుక్రవారం అకస్మాత్తుగా తనిఖీల కోసం రావడం, అది కూడా కోర్టు సమయం దాటిపోయాక రావడంవెనుక మతలేబు ఏంటని ఎద్దేవా చేశారు. తమకు జైళ్లు , పొరాటాలు కొత్తకాదని, చట్టం, న్యాయంపై నమ్మకం ఉందని కోర్టులో న్యాయంకోసం పోరాడుతామి తెల్చిచెప్పారు. 

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై గతంలోనే  సెలబ్రీటీలు, ఫెమస్ పొలిటిషియన్ల  జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోనే వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత జాతకం, కణిమొళి జాతకంకు దగ్గర పొలిక ఉందని చెప్పారు. అదేవిధంగా.. కరుణానిధి ప్లేస్ కేసీఆర్ ది అని ఆయన అప్పుడు లాజిక్ గా చెప్పారు.

ఈ క్రమంలో వేణు స్వామి చెప్పిన లాజిక్ ప్రకారం.. 2 జీ స్పెక్ట్రమ్ కేసులో అరెస్టైన కనిమొళి.. జైలుకు కూడా వెళ్లొచ్చారు. కవిత కూడా జైల్లో ఊచలు లెక్కపెట్టడం ఖాయమని వేణుస్వామి ఆరోజే పైలాజిక్ ను సింక్ చేసి మరీ చెప్పారు. అయితే.. రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ కేసు, పెండింగ్ లో ఉండటం, ఒక్కసారిగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవతని ఈడీ ఆగమేఘాల మీద అరెస్టు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read More: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం... సీఎం కేజ్రీవాల్ కు బెయిల్..

ప్రస్తుతం కవితను అరెస్ట్ చేసి తెలంగాణాలో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చూడాలని ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ భావిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు జైళ్లు, పొరాటాలు కొత్తకాదని, వేటికైన తాము సిద్ధంగానే ఉంటామని బీఆర్ఎస్ నేతలు గట్టిగానే సమాధానం చెప్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News