Durga Matha Idol vandalised: హైదరాబాద్‌లో నవరాత్రి ఉత్సవాల్లో దారుణం చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌లో బుర్ఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు.. దుర్గా మాత మండపంపై దాడికి తెగబడ్డారు. అందులో ఒకరు చేతిలో ఉన్న బళ్లెంతో దుర్గా మాత విగ్రహం ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా... ఈ దాడిలో దుర్గా మాత ఆసీనులై ఉన్న సింహం విగ్రహం తల భాగం పాక్షికంగా దెబ్బతింది. మహిళలు దుర్గా మాత మండపంలో విధ్వంసానికి పాల్పడి అమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూడటం గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు స్థానికులపైకి కూడా తిరగబడినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం ఉదయం ఖైరతాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దుర్గామాత విగ్రహం పాక్షికంగా దెబ్బ తిన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుపుకునే నవరాత్రి ఉత్సవాల ప్రతిస్టను దెబ్బతీసి, ఉత్సవాలకు భంగం కలిగించేలా దాడులు చేయడం ఏంటని నెటిజెన్స్ మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన వారు బుర్ఖాలు ధరించి ఉండటంతో సున్నితమైన ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బుర్ఖా ధరించి ఉన్న మహిళలను ఈ దాడి ఎందుకు చేశారని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పోలీసులు చెప్పినట్టుగా రిపబ్లిక్ టీవీ కథనం పేర్కొంది. మహిళల ఇద్దరి మానసిక పరిస్థితి సరిగా లేదని.. తాము ఏం అడుగుతున్నామో కానీ వారికి అర్థం కావడం లేదని చెబుతున్న పోలీసులు.. వారిని విచారించడానికి డాక్టర్ల సహాయం తీసుకుంటున్నట్టు తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర ఈ వివరాలు వెల్లడించినట్టుగా రిపబ్లిక్ టీవీ కథనం వెల్లడించింది.


Also Read : Navratri 2022 Vastu Upay: ఈ నగరాలకు అమ్మవారి పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?


Also Read : October Festival list 2022: అక్టోబరు నెలలో రానున్న వ్రతాలు, పండుగలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి