హైదరాబాద్: తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC) అమలు చేస్తామని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (BJP MLA Raja Singh) అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం కానీ లేదా జాతీయ పౌర జాబితా కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వాటి ద్వారా ముస్లింలకు ఏమీ నష్టం వాటిల్లదని అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఉన్న ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ముస్లింలు అర్థం చేసుకోవాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాపై అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో బహిరంగ సభ నిర్వహిస్తామని రాజాసింగ్ ప్రకటించారు. బీజేపీ చేపట్టే సభలకు అనుమతి ఎందుకివ్వరని ప్రశ్నించిన రాజాసింగ్‌.. ఎంఐఎం పార్టీని, ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసి చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఎన్‌పిఆర్‌పై రెండు రోజుల్లోగా టీఆర్ఎస్ వైఖరి: అసదుద్దీన్ ఒవైసి


ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసిపై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాజాసింగ్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై ఉన్న భయంతోనే ఓవైసీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేస్తామంటున్నారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..