GHMC Elections 2020 : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు భాగ్యనగరం సర్వం సిద్ధం అయింది. ప్రజాస్వామ్యంలో జరిగే అతిపెద్ద పండగ ఎలక్షన్. ఇందులో తమ భవితను మార్చే సత్తాగల అభ్యర్థులకు ఓటర్లు ప్రజాప్రతినిధిగా ఎంపిక చేస్తారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ కార్పోరేషన్ ఓటరు స్లిప్పులను కూడా జారీ చేసింది. డిసెంబర్ 1న ఉదయం ఓటు వేయడానికి భాగ్యనగరవాసులు సిద్ధం అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | GHMC Election 2020: జీహెచ్ఎంసి యాప్‌లో పోలింగ్ కేంద్ర వివరాలు, మరెన్నో సదుపాయాలు..


జీఎహెచ్ఎంసి (GHMC Elections 2020) ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధం అయినా కొంత మంది వద్ద ఓటరు కార్డుల లేవని సమాచారం. ఎక్కడో మిస్సయి ఉంటుంది. అయితే దీనికి జిల్లా ఎన్నికల అధికారి ఒక పరిష్కారం సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఏడైనా ఐడెంటిఫికేషన్ కార్డు చూపించి ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లోకి వెళ్లవచ్చు.



Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే 


ఆ ఐడీ కార్డులు ఇవే..
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్
- బ్యాంక్ పాస్‌బుక్ కార్డు
- సర్వీస్ ఐడెంటిటీ కార్డు
- పాన్ కార్డు
- ఎన్‌పిఆర్ స్మార్ట్ కార్డు,
- ఆర్‌.జి.ఐ
- జాబ్ కార్డు
- హెల్త్ కార్డు
 - పింఛ‌న్‌ పత్రాలు



Also Read | BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజెన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే..
- MLA, MP, MLC ల అధికారిక ఐడీ కార్డుఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం,
- రేషన్ కార్డు 
- కాస్ట్ సర్టిఫికెట్ అంటే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం
- ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు
- ఆర్మ్స్ లైసెన్స్ కార్డు 
- అంగవైకల్యం సర్టిఫికేట్  
- లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు
- పట్టదారు పాస్‎బుక్  


వీటిని చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక అధికారులను కూడా సంప్రదించవచ్చు.


Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook