CBI to Interrogate MLC Kavitha on December 11th: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను సాక్షిగా విచారించేందుకు సీబీఐ నోటీసులు జారీచేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా మీద నమోదైన కేసులో మీ నుంచి కొన్ని క్లారిఫికేషన్లు కావాలి అంటూ ఎంపీ కవితకు సీబీఐ ముందు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లేదా ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా ఆమె నోటీసుల్లో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ముందుగా విచారణకు ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ దానికి కవిత సమ్మతిస్తూ హైదరాబాద్ నివాసంలో తాను విచారణకు హాజరవుతానని నోటీసులకు సమాధానం పంపారు. ఆ తర్వాత ఆమె ఏమని ఆలోచించుకున్నారో అమూల్యంగా సిబిఐకి తనకు ఈ వ్యవహారం మీద అందిన ఫిర్యాదు అలాగే ఎఫ్ఐఆర్ కాపీ అందించాలని అందించిన తర్వాత ఎప్పుడు విచారణకు హాజరవుతా అనే విషయాన్ని తెలుపుతానని పేర్కొన్నారు. ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీన తాను విచారణకు హాజరు కాలేని ఆ రోజు కొంచెం అర్జెంట్ పనులు ఉండడంతో ఈనెల 11, 12, 14, 15వ తేదీలలో ఏదో ఒక రోజు హాజరవుతానని పేర్కొన్నారు.


ఈ క్రమంలో సీబీఐ కవిత విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది. కవితతో ఈ నెల 11వ తేదీన సమావేశం అయ్యేందుకు సీబీఐ అంగీకరించింది. కవిత లేఖకు సీబీఐ  స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లో కవిత నివాసంలో 11 గంటలకు విచారణకు వస్తామని సీబీఐ తెలిపింది. అదే రోజు మీరు అందుబాటులో ఉంటారా ఉండరా అనే విషయాన్ని తెలియజేయాలి అని కూడా సీబీఐ అధికారులు పంపిన మెయిల్ లో కోరారు.


ఇక ఈ కేసులో కవిత కేవలం సాక్షి మాత్రమేనని నిందితురాలు అయితే ఆమెనే నేరుగా విచారణకు పిలిపించుకుని మాట్లాడతారు కానీ ఇలా మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తామని చెప్పరు కదా అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఒక వాదన తెర మీదకు తీసుకు వస్తున్నారు. కాబట్టి తమ అధినేత్రి కుమార్తె కవితకు ఈ కేసులో ఎలాంటి ఇబ్బంది కలగకపోవచ్చు అని వారంతా చెబుతున్నారు. కవిత ఇలాంటి వ్యవహారాలకు వెళ్లే మనిషి కాదని కావాలని టిఆర్ఎస్ ను టార్గెట్ చేసే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని, టీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


Also Read: Yashoda Ott Release: కోర్టు కేసులు క్లియర్.. ఆరోజే ఓటీటీలో యశోద మూవీ !


Also Read: Priyanka Jawalkar: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. దెబ్బకు బాలయ్య సినిమా ఛాన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook