CM KCR latest News: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌‌ రావు తీరులో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ అంతా ఇప్పుడు తన ఎదుట బానిసలా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారంటూ మండిపడ్డారు. స్వయంగా సీఎం హింసకు కారణం అవుతున్నారన్నారు. ముఖ్యమంత్రే దాడులకు దిగడం మనం చూస్తున్నామంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 


కేంద్ర బడ్జెట్ విషయంలో, అలాగే కేంద్ర పని తీరుపై, ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ అంత దారుణంగా పాకిస్తాన్ కూడా మాట్లాడదని పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి శత్రువులు ఎవరూ లేరన్నారు.. ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారన్నారు. బీజేపీకి ఉన్నటువంటి ఒకే ఒక శత్రువు పాకిస్తాన్ అని కిషన్ రెడ్డి అన్నారు. 


భారత సైనికుల కుటుంబాల మనోభావాల్ని దెబ్బ తీసేలా సీఎం కేసీఆర్‌‌ మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దాడికి గురైనట్లుగా టెర్రరిస్ట్‌ సంస్థలే అంగీకరించాయని గుర్తు చేశారు. 


సర్జికల్ స్ట్రైక్ విషయంలో బీజేపీకి ఎవరూ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేసీఆర్‌‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ నుంచి అభినందన్‌ను ఇరవై నాలుగు గంటల్లోపే భారత్‌కు రప్పించామని గుర్తు చేశారు. 


విద్యుత్ సంస్కరణల విషయంలో కూడా కేసీఆర్‌‌ చేసిన కామెంట్స్‌ దారుణంగా ఉన్నాయన్నారు. మోటార్లకు మీటర్స్‌ పెట్టాలని కేంద్రం ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి కూడా ఆదేశాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణలో ప్రధాని పర్యటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక యూరియాకు భారీగా సబ్సిడీ తమ ప్రభుత్వానిదే అన్నారు. ఈ ఏడాది లక్ష కోట్లు సబ్సిడీ అందించామన్నారు.


Also Read: Maxwell Wedding Card: భారతీయురాలితో క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వివాహం.. వెడ్డింగ్ కార్డు వైరల్!


Also Read: Nokia G11 Launch: నోకియా స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook