Nokia G11 Launch: ప్రముఖ అంతర్జాతీయ మొబైల్స్ సంస్థ నోకియా మరో రెండు స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. Nokia G21, Nokia G11 అనే రెండు వేరియంట్స్ ను యూరప్ లోని విపణిలో తాజాగా విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్స్ ఒకే విధమైన ఫీచర్స్ తో ఢిఫరెంట్ డిజైన్స్ తో అలరిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా మూడు రోజులు నిరంతరాయంగా పనిచేస్తాయి.
Nokia G11 ధర, ఫీచర్స్
నోకియా G11 వేరియంట్ 3GB RAM + 32GB స్టోరేజ్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ వేరింయట్ ధర 161 యూఎస్ డాలర్ల రూపంలో విక్రయానికి ఉంది. భారత రూపాయి విలువ ప్రకారం రూ.12 వేల కంటే ఎక్కువ ధరకు లభిస్తుంది. బ్లాక్ అండ్ స్నో కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్.. త్వరలోనే ఇతర దేశాల్లోనూ లాంచ్ చేసేందుకు నోకియా సన్నాహాలు చేస్తోంది.
Nokia G11 స్పెసిఫికేషన్స్
1) డిస్ ప్లే - 6.5 Inch IPS LCD
2) పిక్సెల్ రిజల్యూషన్ - 720 x 1600 పిక్సెల్స్ HD
3) రీఫ్రెష్ రేట్ - 180Hz
4) కెమెరా - 8 MP (ఫ్రంట్ కెమెరా)
5) మెయిన్ కెమెరా (13 MP), డెప్త్ కెమెరా (2 MP), మాక్రో కెమెరా (2MP)
6) Unisoc T606 చిప్‌సెట్
7) స్టోరేజ్ - 3 GB RAM, 32 GB ROM
8) ఆండ్రాయిడ్ - 11 వెర్షన్
నోకియా G11 బ్యాటరీ
Nokia G11 18W ఛార్జింగ్ కు సపోర్ట్ అయ్యే 5,050mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. ఇది 10W ఇన్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది. సైడ్- ఫేసింగ్ ఫింగర్ ప్రింట్, మాస్క్ ధరించినా కూడా పనిచేసే ఫేస్ అన్ లాక్ ఫీఛర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, NFC, USB-C, Google అసిస్టెంట్ కీ, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
Also Read: Flipkart Mi Smart TV: రూ.30 వేల విలువైన Mi స్మార్ట్ టీవీ.. ఇప్పుడు రూ. 10,499లకే అందుబాటులో!
Also Read: Jio Recharge Offers: జియో రూ.599 రీఛార్జ్ తో 100 GB డేటా.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook