Teenmar Mallanna : చంచల్‌గూడ జైల్లో తనపై హత్యాయత్నం జరిగిందని క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenamar Mallanna) చేసిన ఆరోపణలపై జైలు పర్యవేక్షణాధికారి డాక్టర్ శ్రీనివాస్ స్పందించారు. మల్లన్న చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనను చీకటి గదిలో బంధించి మానసిక దివ్యాంగులకు ఇచ్చే ఔషధాలను తనకు బలవంతంగా ఎక్కించి పిచ్చివాడిని చేయాలనుకున్నారని మల్లన్న చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్లన్న ఆరోపించినట్లు అసలు జైల్లో (Chanchalguda Central Jail) చీకటి గదులే లేవని డా.శ్రీనివాస్ పేర్కొన్నారు. లేని గదుల్లో తనను బంధించారని మల్లన్న చెప్పుకోవడం సరికాదన్నారు. జైలులో ప్రతీ ఖైదీకి సౌకర్యాలు ఉంటాయని... వారి బాగోగులు చూసేందుకు భద్రతా సిబ్బంది ఉంటారని తెలిపారు. ఖైదీలకు వైద్యులు ఇచ్చే మెడిసిన్‌ను కూడా కేస్‌ షీట్‌లో పొందుపరుస్తారని తెలిపారు. 


'తీన్మార్‌ మల్లన్న టీమ్‌ భవిష్యత్ కార్యాచరణ' (Teenmar Mallanna) పేరిట ఆదివారం (నవంబర్ 14) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామంలో ఓ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పలు సంచలన ఆరోపణలు చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2న కొంతమంది పాత నేరస్థుల సహకారంతో జైల్లో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.


Also Read: Warner On Williamson: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా విలియమ్సన్.. వార్నర్ హింట్


ఆరోజు హత్యాయత్నం విఫలం కావడంతో మరుసటి రోజు తనను జైల్లోని చీకటి గదిలో బంధించారని ఆరోపించారు. ఆ సమయంలో తనకు మానసిక దివ్యాంగులకు ఇచ్చే ఇచ్చే ఔషధాలను బలవంతంగా ఎక్కించబోయారని... తద్వారా తనను పిచ్చివాడిని చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు.  తనను అక్రమంగా జైల్లో పెట్టినా న్యాయస్థానం ద్వారా బయటపడగలిగానని, తనపై ఎన్ని కుట్రలు చేసినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకూ 38 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా మిగతా 32 కేసుల్లో బెయిల్ మంజూరైంది. గత సోమవారం(నవంబర్ 8) మల్లన్న (Teenmar Mallanna) చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe