Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నను ఎడపల్లి తీసుకొచ్చిన పోలీసులు

Teenmar Mallanna in Yedapally police station: విపక్షాల నుంచి సైతం తీన్మార్ మల్లన్నకు మద్దతు వెల్లువెత్తుతోంది. తీన్మార్ మల్లన్న బెయిల్‌పై (Teenmar Mallanna bail petition) విడుదల కాకుండా చూసేందుకు ప్రభుత్వమే ఒకదాని వెంట మరొకటి అక్రమ కేసులు పెట్టిస్తోందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 01:45 AM IST
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నను ఎడపల్లి తీసుకొచ్చిన పోలీసులు

Teenmar Mallanna in Yedapally police station: నిజామాబాద్: ఎడపల్లి పోలీసులు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను ఎడపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. జానకంపేట గ్రామానికి చెందిన సంతోష్‌, రాధాకిషన్‌ గౌడ్‌, సాయి గౌడ్‌, రాజు గౌడ్‌ అనే వ్యక్తులతో కలిసి తీన్మార్‌ మల్లన్న తనను డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించారని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి జయవర్ధన్‌ గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీన్మార్ మల్లన్నపై ఏ5గా కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను రెండురోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగానే నేడు ఎడపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్నను ఎడపల్లికి తీసుకొచ్చారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లన్నకు వైద్య పరీక్షలు (Chintapandu Naveen health) నిర్వహించిన అనంతరం ఆయన్ను ఎడపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్థానిక ఏసీపీ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు మల్లన్నను ప్రశ్నిస్తున్నారు. 

తీన్మార్ మల్లన్నను చంచల్‌గూడ జైలు (Chanchalguda jail) నుంచి ఎడపల్లి పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చారు అనే సమాచారం అందుకున్న ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మల్లన్నకు (Teenmar Mallanna) తమ మద్దతును ప్రకటించారు. 

ఇప్పటికే తీన్మార్ మల్లన్నను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు రాష్ట్రం నలుమూలలా ధర్నాలు, దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తారా అంటూ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna arrest) మద్దతుదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

ఇదిలావుంటే, మరోవైపు విపక్షాల నుంచి సైతం తీన్మార్ మల్లన్నకు మద్దతు వెల్లువెత్తుతోంది. తీన్మార్ మల్లన్న బెయిల్‌పై (Teenmar Mallanna bail petition) విడుదల కాకుండా చూసేందుకు ప్రభుత్వమే ఒకదాని వెంట మరొకటి అక్రమ కేసులు పెట్టిస్తోందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

Trending News