హైదరాబాద్: శేర్ లింగంపల్లి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ..జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ కు ప్రశ్నలు సంధించారు. వచ్చే ఎన్నికలు బీజేపీ ఫ్రంట్..బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ మధ్యే ఎన్నికలు జరగుతాయని అప్పుడు కేసీఆర్ ఏ ఫ్రంట్ ను ఎంచుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర రాజకీయలపై కేసీఆర్ కు సరైన విధానం లేదని..ఈ విషయంలో ఆయనకు స్పష్టత కొరవడిందన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ తిరస్కరిస్తున్న కేసీఆర్ ..ఏ ఫ్రంట్ లో చేరుతారో ఎవరి అడిగినా చెప్పేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. కేసీఆర్ కు బీజేపీ తప్పితే మరోదారి లేదని చంద్రబాబు ఎద్దేవ చేశారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ పై చంద్రబాబ సెటైర్లు
శేర్ లింగంపల్లి  రోడ్ షో లో కేసీఆర్ వైఖరిపై చంద్రబాబు విమర్శలు సంధించారు.  ఐదేళ్లు పాలించలేక ఏడాది ముందే చేతులెత్తేశారని ఎద్దేవ చేశారు. కేవలం నాలుగేళ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పేదలకు 2.5 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో 5 వేల ఇళ్లు కూడా ఇల్లు కూడా కట్టలేకపోయారని..భవిష్యత్తులో కడతారన్న నమ్మకం కూడా లేదని చంద్రబాబు ఆరోపించారు. 


హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు రియాక్షన్
శేర్ లింగంపల్లిలో  రోడ్ షో పొల్గొన్న చంద్రబాబు.. హైదరాబాద్ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించారు.  హైదరాబాద్ విషయంలో టీడీపీ ఏమీ చేయదనని చెబుతున్న కేసీఆర్.. వాస్తవానలను తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర ఏమిటో అందరీ తెలుసు.. కానీ కేసీఆర్‌కు మాత్రమే తెలియదన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచామన్నారు. తన చొరవతోనే భాగ్యనగరంలో ఉద్యోగాలు అవకాశాలు పెరగాయని చంద్రబాబు పేర్కొన్నారు.