CJI NV Ramana:  ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని(Ramappa temple)  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ(CJI  Justice NV Ramana) దర్శించుకున్నారు. సీజేఐ దంపతులకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో సీజేఐ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాధాలు అందజేశారు ఆలయ అధికారులు. ఇటీవల యునెస్కో (UNESCO) గుర్తింపు పొందింది రామప్ప దేవాలయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలయ దర్శనం అనంతరం సీజేఐ అక్కడి నుంచి వరంగల్‌(Warangal) చేరుకుని రాత్రికి నిట్‌ అతిథి గృహంలో బస చేస్తారు. అలాగే ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హనుమకొండలోని కోర్టుల సముదాయన్ని ప్రారంభిస్తారు. ఆదివారం సాయంత్రం షామీర్‌పేటలోని నల్సార్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. తర్వాత ఆ రాత్రి హైదరాబాద్‌లో బస చేసి సోమవారం ఢిల్లీకి వెళ్తారు. 


Also Read: Andhra Pradesh: మందుబాబులకు శుభవార్త...ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook