Andhra Pradesh: మందుబాబులకు శుభవార్త...ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..

Ap News: మద్యం ధరలను తగ్గిస్తూ..జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 07:31 PM IST
  • మందుబాబులకు గుడ్ న్యూస్
  • మద్యం పన్ను రేట్లలో మార్పులు
  • ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు
Andhra Pradesh: మందుబాబులకు శుభవార్త...ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..

Ap News: మందుబాబులకు ఏపీ సర్కారు(Ap government) గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, ఎక్సైజ్‌ డ్యూటీ స్పెషల్‌ మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకువచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం ధరలు(Liquor Rates) తగ్గే అవకాశం ఉంది. 

ఇండియన్‌ మేడ్‌ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు రజత్ భార్గవ(Rajat Bhargava) స్పష్టం చేశారు. వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయాలు జరుగుతాయని... రాష్ట్రంలో 37 శాతం వినియోగం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 

Also read: Vishakapatnam: అనుమానంతో భార్యను డంబెల్‌తో కొట్టి చంపిన భర్త-ఆపై సూసైడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News