High tension in Bandi Sanjay's Padayatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండో విడత యాత్రలో భాగంగా ఐదో రోజు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పర్యటించారు సంజయ్. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్‌ శ్రేణులకు సంబంధించిన ఓ కారును ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తిరిగి బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు. సంజయ్‌తో పాటు డీకే అరుణ పలువురు ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.


పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంపై సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ శ్రేణులు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పాదయాత్ర ద్వారా పాలమూరు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసే హక్కు, ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 


కాగా, ఐదో రోజు బండి సంజయ్ పాదయాత్ర గద్వాల జిల్లాలోని వేముల, బట్లదిన్నె, షాబాద్ గ్రామాల మీదుగా ఉదండపూర్ వరకు సాగనుంది. ఇటీవలే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆలంపూర్ నుంచి సంజయ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి మీదుగా సాగనున్న ఈ పాదయాత్ర... మే 14న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో ముగియనుంది. 


Also Read: IPL Delhi Capitals: ఐపీఎల్‌కు కరోనా షాక్.. ఢిల్లీ ఆటగాడికి పాజిటివ్.. పంజాబ్‌తో మ్యాచ్‌ డౌటే..!


Also Read: Telangana Job Notifications: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్... వారం రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook